భారత్లో కొత్తగా 20,408 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 54 మంది కరోనా తో మృతి చెందారు. గత 24 గంటల్లో 20,958 మంది రికవరీ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,43,384 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తెలంగాణకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరో రెండు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని… మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
Advertisement
మహారాష్ట్ర సీఎంను ఉద్ధవ్ థాక్రే సోదరుడి కుమారుడు నిహార్ థాక్రే కలవడం హాట్ టాపిక్ గా మారింది. సీఎం ఏక్నాథ్ షిండేకు నిహార్ థాక్రే మద్దతు ప్రకటించారు.
తెలంగాణలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిపోయింది. రాష్ట్రం ఏర్పడ్డాక జులై మాసంలో నేడు అత్యధికంగా తొలిసారి 12,317 మెగావాట్స్ విద్యుత్ డిమాండ్ ఏర్పడింది.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపై రాష్ట్రంలో కొత్త పన్నులు విధించవద్దని అధికారులను ఆదేశించారు.
Advertisement
రణ్బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఓ సినిమా షూటింగ్లో ప్రమాదం చోటుచేసుకుంది. షూటింగ్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు.
తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఒక్కో పీరియడ్ కు రూ.390 జీతం చెల్లిస్తామని ప్రకటించింది.
ప్రముఖ పాప్ సింగర్ షకీరా జైలుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెయిన్ కోర్టు పన్ను ఎగవేత కేసులో ఆమెకు 8 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ర్యాంకులు, మార్కుల ప్రకటనపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతో ఇప్పటినుండి గ్రేడులు మాత్రమే ప్రకటించనున్నారు.
ఏపీలో శ్రావణమాస వ్రతాలు ఉచితంగా చేయాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. 52 ఆలయాల్లో ఉచితంగా శ్రావణమాస వ్రతాలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.