Home » శోభ‌న్ బాబు ప‌వ‌న్ క‌ల్యాణ్ ల కాంబోలో మిస్ అయ్యిన సినిమా ఏదో తెలుసా…? ఎందుకు మిస్ అయ్యిందంటే..?

శోభ‌న్ బాబు ప‌వ‌న్ క‌ల్యాణ్ ల కాంబోలో మిస్ అయ్యిన సినిమా ఏదో తెలుసా…? ఎందుకు మిస్ అయ్యిందంటే..?

by AJAY
Ad

హీరో శోభ‌న్ బాబు ఒకప్ప‌డు అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడిగా టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగారు. ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల్లో నటించి అభిమానుల‌ను సంపాదించుకున్నారు. త‌న కంటూ ఎంతో ఇమేజ్ ను సంపాదించుకున్నప్పిటికీ ఇండ‌స్ట్రీలో పలుకుబ‌డి ఉన్న‌ప్ప‌టికీ త‌న ఫ్యామిలీని మాత్రం సినిమాల‌కు దూరంగా ఉంచాడు. అంతే కాకుండా హీరోగా సినిమాల‌కు గుడ్ బై చెప్పిన త‌ర‌వాత మ‌ళ్లీ తెర‌పై క‌నిపించ‌లేదు.

Advertisement

అయితే నిజానికి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ శోభ‌న్ బాబు కాంబినేష‌న్ లో ఓ సినిమా రావాల్సి ఉంది. కానీ అది కుద‌ర‌లేదు….ఆ సినిమా ఏంటి ఎందుకు కుద‌ర‌లేదు అన్న సంగతి ఇప్పుడు చూద్దాం….ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా భీమినేని శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వంలో సుస్వాగ‌తం అనే సినిమా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఈ ఎమోష‌న‌ల్ సినిమాకు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ల్యాన్ తండ్రి పాత్ర సినిమాకు చాలా ఇంపార్టెంట్ కాగా ఈ పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టుడు ర‌ఘువ‌రుణ్ న‌టించి మెప్పించారు. ఎమోష‌నల్ సీన్ల‌లో ర‌ఘువ‌రుణ్ అద్భుతంగా న‌టించారు. న‌టించారు అనే కంటే ర‌ఘువ‌రున్ జీవించారు అనే చెప్పాలి. అయితే నిజానికి ఈ పాత్ర కోసం ద‌ర్శ‌కుడు శ్రీనివాసరావు శోభ‌న్ బాబును సంప్ర‌దించార‌ట‌.

Raghuvarun

Raghuvarun

కానీ శోభ‌న్ బాబు హీరో గా గుడ్ బై చెప్పి ఖాళీగా ఉన్నారు. కానీ తాను న‌టించను చెప్పారట‌. శోభ‌న్ బాబు త‌న‌ను ప్రేక్ష‌కులు ఎప్పుడూ హీరోగా అందంగానే గుర్తుపెట్టుకోవాల‌ని య‌వ్వ‌నం త‌గ్గిపోగానే సినిమాలకు గుడ్ చెప్పారు. సుస్వాగ‌తం సినిమాలో ర‌ఘువ‌రుణ్ కూడా అద్భుతంగా న‌టించాడు. మ‌రి సోగ్గాడు ఆ పాత్ర‌లో న‌టిస్తే ఎలా ఉండేదో మ‌రి.

Visitors Are Also Reading