Home » వెళ్లినవారి పరిస్థితి భయానకం… అందుకే నేను వెళ్ళాను..!

వెళ్లినవారి పరిస్థితి భయానకం… అందుకే నేను వెళ్ళాను..!

by Azhar

జబర్దస్త్ అనే కార్యక్రమం ఎంతోమందిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. అలాగే అప్పటికే ఇండస్ట్రీలో ఉన్న చాలా మందికి పేరు అనేది తీసుకువచ్చింది. ఇక అందులో రాకెట్ రాఘవ ఉంటాడు. ఎప్పుడో 2001 లో ఇండస్ట్రీలోకి వచ్చిన రాకెట్ రాఘవ సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వస్తున్న తరుణంలో ఆయనకు 2013 లో ఈ జబర్దస్త్ లో అవకాశం వచ్చింది. అయితే ఈ షోలో ఈయనకు అంటూ మంచి పేరు అనేది ఉంది. దానికి తోడు.. ఈ కార్యక్రమం ప్రారంభమైనసమయం నుండి ఇప్పటివరకు కూడా ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా చేసిన ఘనత ఈయనదే.

అయితే ఈ విషయంలో ఈయనపై చాలా మంచులు కూడా వేస్తుంటారు. రాకెట్ రాఘవ ఒక్క టీం లిడార్ ను కూడా జబర్దస్ కు ఇవ్వలేదు అని అంటుంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఈ షో నుండి చాలా మంది వెళ్లిపోతున్నారు. దీని ద్వారా పేరు, డబ్బులు సంపాదించిన చాలామంది ఈ కార్యక్రమం నుండి వెళ్లిపోయారు. కానీ రాకెట్ రాఘవ మాత్రం మొదటి నుండి ఇప్పటివరకు ఇందులోనే ఉన్నారు. అయితే ఆయనను మీరు జబర్దస్త్ నుండి ఎందుకు బయటకు రావడం లేదు అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించారు.

అయితే ఈ ప్రశ్నకు రాకెట్ రాఘవ సమాధానము చెబుతూ.. నేను జబర్దస్త్ నుండి బయటకు రాకపోవటానికి రెండు కారణాలు ఉన్నాయి అన్నారు. అందులో మొదటిది సంతృప్తి. మీరు చేసే పనిలో మీకు సంతృప్తి అనేది ఉన్నప్పుడు దానిని వదలాల్సిన అవసరం లేదు. ఇపుడు జబర్దస్త్ లో చేయడం సంతృప్తిగా ఉంది అన్నారు. అలాగే రెండవది.. ఈ షో నుండి వెళ్లిన వాళ్ళ జీవితం అనేది చుసిన తర్వాత నాకు భయం అనేది కలిగింది. మళ్ళీ ఇందులోకి రావచ్చా.. లేదా అనే భయంతోనే నేను జబర్దస్త్ లో కొనసాగుతున్నాను అని రాకెట్ రాఘవ అన్నారు.

ఇవి కూడా చదవండి :

కోహ్లీ నాతో 20 నిముషాలు మాట్లాడు..!

సౌత్ ఆఫ్రికా క్రికెట్ లీగ్ లో ధోని…?

Visitors Are Also Reading