భారత్‌లో కొత్తగా 20,038 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 47 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 1,39,073 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో భద్రాచలం కరకట్ట పైన ఉన్న వారిని పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. కరకట్ట మీదకు ఎవ్వరూ రాకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. గోదావరి ఉధృతి పెరగడంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ వెల్లడించారు.
Advertisement
ఈరోజు నుండి దేశవ్యాప్తంగా కరోనా బూస్టర్ డోస్ వ్యాక్సిన్ ను వేయనున్నారు. ఫ్రీ గా ఈ వ్యాక్సిన్ ను ప్రజలకు అందించనున్నారు.
ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ రెస్క్యూ ఆపరేషన్ విషాదంగా ముగిసింది. వాగు నుండి జమీర్ మృతదేహాన్ని రెస్క్యూ టీమ్ వెలికి తీసింది. భారీ వర్షాలతో కారుతో పాటు జమీర్ వాగులో చిక్కుకున్నారు. మూడ్రోజులుగా రెస్క్యూ టీమ్ ఆపరేషన్ కొనసాగింది.
Advertisement
ఏపీలో ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలు జారీ చేశారు. వాలంటీర్లను ఏ పార్టీ తరుపున పోలింగ్ బూత్ ఏజెంట్లుగా కూడా అనుమతించవద్దని సీఈఓ స్పష్టం చేశారు.
నేడు సీఎం జగన్ విశాఖ జిల్లాలో పర్యించనున్నారు. వైఎస్సార్ వాహన మిత్ర కార్యక్రమంలో పాల్గొననబోతున్నారు. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌కు చేరుకుని వైఎస్సార్ వాహన మిత్ర లబ్ధిదారులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లంక గ్రామాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. 36 లంక గ్రామాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను ఇప్పటికే గుర్తించారు. మూడో ప్రమాద హెచ్చరికలతో 31,382 కుటుంబాలపై ప్రభావం పడుందని అధికారులు వెల్లడించారు.
దర్శకుడు, నటుడు ప్రతాప్ పోతెన్ మరణించారు. తెలుగు,తమిళ భాషల్లో ప్రతాప్ నటించారు. సినిమాలకు దర్శకత్వం వహించారు.
బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 24క్యారెట్ ల 10గ్రాముల బంగారం ధర రూ.51,160 కు చేరుకుంది. 22 క్యారెట్ ల బంగారం ధర రూ.46,900 లకు చేరింది.