టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ రచయిత, సంచలన దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కు అరుదైన గౌరవం దక్కింది. ఈ విషయాన్ని స్వయం ప్రధాని నరేంద్రమోడీ ట్వీట్ చేశారు. విజయేంద్ర ప్రసాద్ రచనలు భారతదేశ అద్భుతమైన సంస్కృతిని ప్రదర్శిస్తాయని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఓ ముద్ర వేశాయని ప్రశంసించారు.
Advertisement
రాజ్యసభకు నామినేట్ అయినందుకు ప్రధాని అభినందలు తెలిపారు. విజయేంద్ర ప్రసాద్ దశాబ్దాలుగా సృజనాత్మ ప్రపంచంతో అనుబంధం కలిగి ఉన్నారు. అతని రచనలు భారతదేశం అద్భుతమైన సంస్కృతిని ప్రదర్శిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా ఒక ముదర వేశాయి. రాజ్యసభకు నామినేట్ అయినందకు ఆయనకు ప్రత్యేక అభినందను ట్వీట్లో పేర్కొన్నారు. విజయేంద్ర ప్రసాద్‌తో పాటు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా, పరుగుల రాణి పీటీ ఉష, వీరేంద్ర హెగ్దేను కలిపి మొత్తం నలుగురిని రాజ్యసభకు నామినేట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రపతి కోటాలో వీరిని నామినేట్ చేశారు. ఈ నలుగురు దక్షిణ భారతదేశానికి చెందిన వారే కావడం విశేషం. కళలు, సామాజిక సేవతో పాటు పలు రంగాల్లో సేవలందించిన వారిని రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేసే వెసులుబాటు కల్పించింది రాజ్యాంగం.
Advertisement
ఇక ఇళయరాజా సంగీతం అనేక భావాలకు ప్రతిబింబం అని, అనేక తరాలకు వారధిలా నిలిచిందని ప్రధాని కొనియాడారు. పీటీ ఉష జీవితం ప్రతి భారతీయుడికి ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఏళ్లుగా ఆమె ఎందరో క్రీడాకారులను తీర్చిదిద్దారని ప్రశంసల వర్షం కురిపించారు. అదేవిధంగా వీరేంద్ర హెగ్దే సామాజిక సేవతో విశేష గుర్తింపు పొందారు. విద్య, ఆరోగ్యం, సంస్కృతి రంగాల్లో కర్ణాటకలో సేవలందిస్తున్నారు. ధర్మస్థల ఆలయాన్ని సందర్శించారు. వీరేంద్ర హెగ్దే గొప్ప సేవా కార్యక్రమాలను స్వయంగా వీక్షించినట్టు ట్వీట్ చేశారు ప్రధాని మోడీ.
Also Read :
రాజమౌళి, కీరవాణి అన్నదమ్ములైనప్పటికీ పేరు ముందు అక్షరాలు ఒకటే ఎందుకు లేవో మీకు తెలుసా..?