Home » జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫోన్ నెంబ‌ర్ లీక్‌.. ఇది షేక్ ఇమామ్ సీన్ మాదిరిగా..!

జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫోన్ నెంబ‌ర్ లీక్‌.. ఇది షేక్ ఇమామ్ సీన్ మాదిరిగా..!

by Anji
Ad

కొన్ని సార్లు మ‌నం ఏదో అనుకుంటే మ‌రేదో అవుతుంటుంది. మ‌రికొన్ని సార్లు ఏది అనుకోకున్నా అన్ని అలా జ‌రిగిపోతుంటాయి. జూనియ‌ర్ ఎన్టీఆర్ జీవితంలో అలాగే జ‌రిగింది. అనూహ్యంగా ఆయ‌న ఫోన్ నెంబ‌ర్ లీక్ అయింది. అస‌లు ఏం జ‌రిగిందంటే..? ఎన్టీఆర్ వీరాభిమాని జ‌నార్థ‌న్ అనే యువ‌కుడు ప్రాణ‌పాయంలో ఉన్నాడు. ఆ యువ‌కుడి త‌ల్లిని ఎన్టీఆర్ ఫోన్ కాల్ ద్వారా ప‌రామ‌ర్శించారు. జ‌నార్థ‌ర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థించారు. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోను రియ‌ల్ హీరో అనిపించుకుంటున్నారు. ఇక్క‌డే అస‌లు క‌థ మొద‌లైంది. ఎన్టీఆర్ మాట్లాడిన ఫోన్ నెంబ‌ర్ అంద‌రి కంట్లో ప‌డింది. ఇంకేముంది ప్రేక్ష‌క‌లోకం ఆ నెంబ‌ర్ డ‌య‌ల్ చేయ‌డం ప్రారంభించారు.

Advertisement

ఇందుకు సంబంధించిన వీడియో, కాల్ రికార్డింగ్‌ను పీఆర్వోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో ఈ వీడియో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోలో ఎన్టీఆర్ మాట‌ల సంగ‌తి అటుంచి ఆ ఫోన్ నెంబ‌ర్ పై క‌న్నేశారు ఆడియ‌న్స్‌. వీడియోలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఆ ఫోన్ నెంబ‌ర్ అనుకుని పొర‌పాటు బ‌డి అంద‌రూ ఆ నెంబ‌ర్ కే ఫోన్ చేస్తున్నార‌ట‌. దీంతో అక్కినేని నాగార్జున హీరోగా న‌టించిన శివ‌మ‌ణి సినిమా మాదిదిగా షేర్ ఇమామ్ సీన్ నిజంగా జ‌రుగుతుంద‌ని తెలుస్తోంది. మ‌రొక వైపు ఎన్టీఆర్ నెంబ‌ర్ ఇలా బ‌య‌ట‌కు రావ‌డంతో ఆయ‌న ఫ్యాన్స్ హ‌ర్ట్ అవుతున్న‌ట్టు స‌మాచారం.

Advertisement

ఇక ఆ నెంబ‌ర్ మాత్ర ఎన్టీఆర్ ది కాదంట‌. ఎన్టీఆర్ ఆర్ట్స్ పేరిట ఉంద‌ని తెలుస్తోంది. ఈ వీడియో చూసిన వారంద‌రూ అది ఎన్టీఆర్ నెంబ‌ర్ అనుకొని ఆయ‌న‌తో మాట్లాడాల‌ని తెగ ట్రై చేస్తున్నార‌ట‌. ఇదే క‌దా ఎర‌కుపోయి వ‌చ్చి ఇరుక్కుపోవ‌డం.. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ తో క‌లిసి చేసిన ఆర్ఆర్ఆర్ మూవీతో ఇటీవ‌లే సూప‌ర్ స‌క్సెస్ సాధిస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్ష‌మే కురిపించింది. అదే ఊపులో ఇప్పుడు కొర‌టాల శివతో 30వ చిత్రాన్ని ఎన్టీఆర్ చేస్తున్నారు. ఈ సినిమాతో ఆ త‌రువాత ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌త్వంలో మ‌రొక సినిమాకు ఇప్ప‌టికీ క‌మిట్ అయ్యారు. ఈ రెండు సినిమాలపై నంద‌మూరి  అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.

Also Read : 

ఫాస్టాగ్ పై వైర‌ల్ అవుతున్న వీడియోలో నిజం ఎంత‌..? అస‌లు ఫాస్టాగ్ ఎలా ప‌నిచేస్తుంది..!

బాల‌కృష్ణ‌తో ఆ హీరోయిన్ సినిమా వ‌దులుకోవ‌డానికి కార‌ణం ఏమిటో తెలుసా..?

Visitors Are Also Reading