అమెరికాలో అబార్షన్ లపై ఆంక్షలు విధిస్తూ కొత్త చట్టం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అబార్షన్ లపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమెరికన్ లు వ్యతిరేకిస్తున్నారు. .
ఏపీలో తిత్లీ తుఫాన్ నష్ట పరిహారం పంపిణీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీఎం జగన్ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. దాంతో సమగ్ర విచారణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
Advertisement
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఈ రోజు వరకు 1,50,826 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరినట్టు అధికారులు వెల్లడించారు.
నేడు మధ్యాహ్నం 1 గంటకు సేన భవన్‌లో శివసేన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం కానుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం లో సీఎం ఉద్దవ్ థాక్రే పాల్గొంటారు.
నందమూరి బాలకృష్ణకు కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో గత రెండు మూడు రోజులుగా తనను కలిసిన ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తెరిగి తగిన పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
Advertisement
తెలంగాణలో ఇంటర్ ఫలితాలను ఈ నెల 27న విడుదల చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ అనుమతి రాగానే 27న ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర. 200 తగ్గి 47,150 కి చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర .230 తగ్గి 51,765 కి చేరుకుంది.
రాష్ట్రంలోని ఆలయాల్లో జరిగే వ్యాపారాల పై వృత్తిపన్ను తప్పనిసరి చేస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దేవాదాయ శాఖ ఆలయాల వరకు వృత్తి పనులు చెల్లించాలని నిర్ణయించింది. ఆయా ఆలయాల్లో వృత్తిపన్ను తప్పనిసరి చేస్తూ చట్టంలో నిబంధనలను సైతం సవరించారు.
జూలై 1న బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ కు రానున్నారు. జూలై 2,3 తేదీల్లో హైదరాబాద్ లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ చేరుకోనున్నారు.
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటి వరకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేయలేదు. కాగా సోమవారం నుండి పాఠ్యపుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించారు.