మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దేశవ్యాప్తంగా అందరికీ పరిచయమే. ముఖ్యంగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మగధీర, ఆర్ఆర్ఆర్ సినిమాలు సంచలనం సృష్టించిన విషయం విధితమే. ఇటీవల చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆచార్య సినిమాలో నటించినప్పటికీ ఆ సినిమా అంతగా సక్సెస్ సాధించలేకపోయింది. ఇక చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కే మూవీపై ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. ఇటీవలే రామ్‌చరణ్, ఉపాసన దంపతులు తమ 10వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వెకెషన్ వెళ్లారు. అయితే ఆ సమయంలో వారి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
Advertisement
పెళ్లి రోజు సందర్భంగా ఉపాసన ధరించిన ఓ డ్రెస్ ఖరీదు రూ.2లక్షలు అని తెలియగా.. ప్రస్తుతం రామ్‌చరణ్ ఓ స్టైలీష్ డెనిమ్ జాకెట్‌తో కనిపించి అందరినీ ఆకర్షించాడు. ఆయన ఎయిర్‌ఫోర్టులో ఉన్నప్పుడు ఈ ఫోటో తీసారు. ముఖ్యంగా ఈ ఫోటోలో చరణ్ ధరించిన డెనిమ్ జాకెట్ అందరినీ ఆకట్టుకుందనే చెప్పాలి. ప్రధానంగా ఆ జాకెట్ ధర కోసం ఆన్‌లైన్ చాలా మంది వెతికి మరి చూశారట. దాని ధర తెలిసి అందరూ ఆశ్చర్యపోయారట. రామ్‌చరణ్ ధరించిన ఆ డెనిమ్ జాకెట్ ఖరీదు రూ.2లక్షలు అని తెలిసి షాక్ అవుతున్నారు. ఈ తరుణంలోనే చరణ్ జాకెట్‌తో ఉన్న ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది.
Advertisement
రామ్‌చరణ్ సినిమాల విషయానికొస్తే.. తన 15వ సినిమాను శంకర్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇందులో చరణ్ త్రిబుల్ రోల్‌లో నటిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. హీరోయిన్‌గా ఆయనకు జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సునీల్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడట. ఈ సినిమాకు టైటిల్ అధికారికంగా ఇంకా ఖరారు చేయలేదు. సోషల్ మీడియాలో మాత్రం అధికారి అనే టైటిల్ అని ప్రచారం జరుగుతోంది. అత్యంత త్వరలోనే ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. ఇదిలా ఉండగా.. ఈ మధ్య రామ్‌చరణ్, ఉపాసనలు ఏం చేసినా కానీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడం విశేషం.
Also Read :
చిరంజీవితో వర్మ సినిమా ఆగిపోవడానికి కారణం.. ఆ మూవీయేనా..?