నందమూరి నటసింహం ప్రస్తుతం సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం విషయం తెలిసిందే. బోయపాటి తో హ్యాట్రిక్ విజయంగా అభిమానులకు అఖండను అందించిన బాలయ్య ఇప్పుడు సూపర్ హిట్ దర్శకులను లైన్ లో పెట్టాడు. అందులో అనిల్ రావిపూడి కూడా ఒక్కరు. ఈ మధ్యే అనిల్ తీసిన ఎఫ్3 సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈయన బాలయ్యతో తన తర్వాతి సినిమా చేబోతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ చెక్కర్లు కొడుతుంది.
Advertisement
అయితే అనిల్ దర్శకత్వంలో వచ్చే ఈ సినిమాలో బాలయ్య 50 ఏళ్ళ వయస్సుగల వ్యక్తి పాత్రలో కనిపించబోతుండగా.. ఇందులో మరో హీరో రాజశేఖర్ కూడా ఉండబోతున్నడట. అయితే అది విలన్ గాన.. లేక బాలయ్య స్నేహితునిగాన అనేది మాత్రం క్లారిటీ లేదు. గాని ఈ సినిమాలో అనిల్ రాజశేఖర్ గారి నిజమైన వాయిస్ వడబోతున్నాడు అని తెలుస్తుంది. అయితే రాజశేఖర్ గారి వాయిస్ ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. అందుకే ఆయన ప్రతి సినిమాకు సాయి కుమార్ గారు డబ్బింగ్ చెబుతారు.
Advertisement
కానీ ఈ సినిమాలో మాత్రం ఆయన నిజమైన వాయిస్ వాడలని అనిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఇక ఇందులో బాలయ్యకు ఓ కూతురు ఉంటుందట. ఆ పాత్రలో ఈ మధ్యే వచ్చిన పెళ్లిసందడి సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీలీల నటించనుంది అని తెలుస్తుంది. ఇదంతా ఇలా ఉంటె ప్రస్తుతం బాలయ్య… గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించనుంది.
ఇవి కూడా చదవండి :