దర్శక ధీరుడు రాజమౌళి సినిమా అంటే ఏ రేంజ్‌లో ఉంటుందో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు రాజమౌలి. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కించి భారీ సక్సెస్ సాధించిన రాజమౌళి తన తరువాత ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. వీరి కాంబో సినిమా వస్తుండడంతో ఇటు రాజమౌళి అభిమానులతో పాటు.. అటు మహేష్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రీదుర్గ ఆర్ట్స్ బ్యానర్‌పై సీనియర్ నిర్మాత కే.ఎల్.నారాయణ భారీ ఎత్తున ఇండియన్ ఫిలిం హిస్టరీలో నిలిచిపోయేవిధంగా భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మించనున్నట్టు టాక్. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ బయటకి వచ్చింది.
Advertisement
సౌత్ ఆఫ్రికా అడవుల్లో సాగే భారీ అడ్వెంచర్ డ్రామా మూవీసీ ఈ చిత్రం తెరకెక్కనున్నదని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పనులు పూర్తి చేస్తున్నారట రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. ఈ సినిమాలో నటించబోయే నటీనటుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టిన రాజమౌళి ఇందులో స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్‌ను తీసుకోవాలని అనుకున్నారట. ఇందుకు ఐశ్వర్యతో సంప్రదింపులు కూడా చేసినట్టు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే ఈ సినిమా రేంజ్ మరొక విధంగా ఉంటుంది. ఇక మాటల్లో చెప్పలేం. ఈ సినిమాలో మహేష్ కోసం ప్రముఖ హీరోయిన్ పేరు ఫిక్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
Advertisement
బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశముందని సమాచారం. ప్రభాస్‌తో సాహో మూవీ చేసి మంచి క్రేజ్ దక్కించుకున్న శ్రద్ద స్వతహాగా సూపర్‌స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ కావడం విశేషం. మహేష్, రాజమౌళి సినిమాలో హీరోయిన్ పాత్రకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుందనే చెప్పాలి. అలాంటి పాత్రకు శ్రద్ధాకపూర్ అయితేనే కరెక్ట్ అని దర్శకధీరుడు ఆలోచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా కోసం సిద్ధంగా మహేష్. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఎస్ఎస్ఎంబీ 28గా రూపొందనున్న ఈ చిత్రానికి అర్జునుడు అనే పరిశీలిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇదివరకే అతడు, ఖలేజా వంటి సినిమాల తరువాత మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడవ సినిమా ఇది. ఈ సినిమా షూటింగ్ పూర్తికాగానే మహేష్-రాజమౌళి సినిమా పట్టాలెక్కనుంది.
Also Read :
చిన్నారులకు గుడ్‌న్యూస్.. ఐదేళ్లలోపు పిల్లలకు ఇంటి వద్దనే ఉచిత ఆధార్ రిజిస్ట్రేషన్
Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశివారు పట్టుదలతో పని పూర్తి చేస్తారు