Home » సాయి ప‌ల్ల‌వి పెళ్లి చేసుకునేది తెలుగు అబ్బాయినేనా..?

సాయి ప‌ల్ల‌వి పెళ్లి చేసుకునేది తెలుగు అబ్బాయినేనా..?

by Anji
Ad

సౌత్ ఇండియాలోనే మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్‌ల‌లో ఒక‌రు అయిన సాయిప‌ల్ల‌వి ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో త‌న క్యారెక్ట‌ర్‌ను చాలా కొత్త‌గా ఉండాల‌ని అదేవిధంగా సినిమా క‌థ కూడా రిఫ్రెష్‌గా అనిపించాల‌ని ఆలోచిస్తుంటుంది. వైవిద్య‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త వినోదం పంచాల‌ని కోరుకుంటుంది. త్వ‌ర‌లోనే ఆమె విరాట‌ప‌ర్వం సినిమాతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నున్న‌ది. ఇందుకు సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు సాగుతున్నాయి. ఈ త‌రుణంలో ఓ టీవీ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది.

Advertisement

ఇక సాయి ప‌ల్ల‌వి ఎంతో ఒదిగి మాట్లాడింది అని పొగ‌డ‌గా.. అంత‌లేదు అని.. అలా అన‌కండి అని సింపుల్గా త‌న స్థాయిని పెంచుకుంది. మ‌రొక చోట కుర‌చ దుస్తుల ప్ర‌స్తావ‌న రాగా.. అది చూస్తే వారి దృష్టి మీద ఆధార‌ప‌డి ఉంటుంద‌ని చెప్పుకొచ్చింది సాయిప‌ల్ల‌వి. కూర్చున్న విధానం, త‌ల కాలిని సైతం క‌నిపించ‌కుండా దుప‌ట్టాతో క‌వ‌ర్ చేసిన విధానాన్ని రాధాకృష్ణ గుర్తించాడు. ఆ విష‌యాన్ని సాయిప‌ల్లవితో నేరుగానే చెప్పాడు. ఆమెపై ఎన్ని ప్ర‌శంస‌లు కురిపించినా.. కూడా సాయిప‌ల్ల‌వి చాలా పొందిక‌గా స‌మాధానం ఇచ్చింది. త‌న ఇంట్లో బ‌డ‌గ మాట్లాడేట‌ప్పుడు త‌న‌కు మ‌ధ్య‌లో తెలుగు వ‌స్తుంటుంది. అప్పుడు త‌న తండ్రి ఎవ‌రైనా తెలుగు అబ్బాయిని చూసుకొని పెళ్లి చేసుకోవాల‌ని అంటున్నార‌ని అంటుంది.

Advertisement


త‌నకు 23 ఏళ్లకే పెళ్ల‌యి 30 సంవ‌త్స‌రాలు వ‌చ్చే వ‌ర‌కు ఇద్ద‌రు పిల్ల‌లు ఉంటార‌ని అనుకున్నాను. కానీ త‌న మాట‌ల‌తో అంద‌రిని అవాక్క‌య్యేలా చేసింది. ఆమె చేసిన ఈ వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. త‌న‌కుతిరుగులేని క్రేజ్ ను సంపాదించుకుంది సాయిప‌ల్లవి. ఆడ‌వాళ్లు మీకు జోహార్లు అనే సినిమా ఈవెంట్‌లో సుకుమార్ చెప్పిన‌ట్టుగా సాయిప‌ల్ల‌వి వాస్త‌వంగానే ఓ లేడీ ప‌వ‌ర్ స్టార్ అనే చెప్ప‌వ‌చ్చు. సినిమాలు హిట్టా ఫ‌ట్టా అన్న తేడా లేకుండా సాయిప‌ల్ల‌వి క్రేజ్ అలా పెరుగుతూనే ఉంటుంది. చివ‌ర‌గా శ్యామ్ సింగ‌రాయ్ సినిమాతో ప‌లుక‌రించిన సాయిప‌ల్ల‌వి ఇప్పుడు విరాట ప‌ర్వంతో అద‌ర‌గొట్టేందుకు సిద్ధం అయింది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డి చేతిలో ప‌లు క్రేజీ ప్రాజెక్టులే ఉన్నాయి.

Also Read : 

విఘ్నేష్ ఈ స్థాయిలో ఉండటానికి నయనతార మాజీ ప్రియుడే కారణమా…?

తిక్క ప్రశ్న వేసిన నెటిజన్….దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చిన మెగాడాటర్…!

 

Visitors Are Also Reading