ఒక్క మహిళా, పురుషుడు కలిసి వివాహం చేసుకోవడం మాములు విషయమే. కానీ ఇద్దరు మహిళలు కానీ ఇద్దరు పిరుదులు కానీ వివాహం చేసుకోవడం అనేది చాలా వింతగా.. విడ్డురంగా అనిపిస్తుంది. అయితే మన దేశంలో ఇటువంటి సంఘటనలు చాలా అరుదు. ఓ ఏడాదికో రెండేళ్లకో ఒక్కసారి ఒక్క జంట ఇలా ఒక్కటవుతుంది. కానీ విదేశాలలో మాత్రం ఇది ఎక్కువగా జరుగుతుంది. ఇక తాజాగా క్రికెట్ ప్రపంచంలో కూడా ఇటువంటి సంఘటన ఒక్కటి జరిగింది. ఇద్దరు ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్లు పెళ్లి చేసుకున్నారు. దాంతో ఈ పెళ్లి వైరల్ గా మారింది.
Advertisement
అయితే ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న కేథరిన్ బ్రంట్, నాట్ సీవర్ అనే ఇద్దరు క్రికెటర్లు పెళ్లి చేసుకున్నారు. దాదాపు గత ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న ఈ జంట గత ఆదివారం అనగా మే 29న పెళ్లి చేసుకున్నారు. అయితే 2017లో మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్స్ లో ఇండియాను ఓడించి తమ జట్టుకు టైటిల్ అందించడంలో ఈ ఇద్దరే కీలక పాత్ర పోషించారు. అయితే ఆ తర్వాత ఏడాదే అంటే 2018 లో ప్రేమలో పడ్డ ఈ జంట 2019 లో అధికారికంగా ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది.
Advertisement
ఇక ఆ తర్వాత ఏడాదే 2020 లో వీరి పెళ్లి కూడా జరగాల్సింది. కానీ అప్పుడే ప్రపంచాన్ని కమ్మేసిన కరోనా వైరస్ కారణంగా వీరి పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. కానీ రెండేళ్ల గ్యాప్ తర్వాత ఎట్టకేలకు ఈ ఇద్దరు ఇప్పుడు పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే క్రికెట్ ప్రపంచంలో ఇలా ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకోవడం ఇదేం మొదటి సారి కాదు. గతంలో మొత్తం ఇలా నాలుగు జంటలు పెళ్లి చేసుకున్నాయి. మొదటి సారి గతంలో న్యూజిలాండ్ కు చెందిన క్రికెటర్లు అమీ సాటర్త్వేట్-లీ తహుహు పెళ్లి చేసుకోగా.. ఇప్పుడు వీరిది ఐదవ జంటగా ఆవతరించింది.
ఇవి కూడా చదవండి :