హీరో రాజా టాలీవుడ్ లో పరిచయం అక్కర్లేని పేరు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమాతో రాజా ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాతో రాజా లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. అంతే కాకుండా వెన్నెల సినిమాలో కూడా రాజా హీరోగా నటించగా ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని రాజా సినిమాల్లోకి రావడానికి ఎంతో కష్టపడ్డాడు. చిన్నప్పుడే రాజా తన తల్లిని కోల్పోయాడు.
Advertisement
చిన్న తనంలో క్యాన్సర్ తో తల్లి మరణించడంతో తన తండ్రి తాగుడుకు బానిస అయ్యాడు. ఇక రాజాకు 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడే రాజా తన తండ్రిని కోల్పోయాడు. రాజాకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. వాళ్లే రాజాకు తల్లిదండ్రులై బాగోగులు చూసుకున్నారు. రాజా కూడా తన చిన్నతనంలోనే ఓ హోటల్ లో పనిచేశేవాడట. ఎన్నో కష్టాలు పడి డిగ్రీ పూర్తి చేసిన రాజాకు మంచి జీతంతో విదేశాల్లో ఉద్యోగం ఉద్యోగం వచ్చింది.
Advertisement
ఆ తరవాత సినిమాల్లో ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక మొదట హీరోగా అనేక చిత్రాల్లో నటించిన రాజా అవకాశాలు లేకపోవడంతో ఆ తరవాత నెగిటివ్ రోల్స్ సైతం చేశాడు. రాజా చివరగా మంచు మనోజ్ హీరోగా నటించిన మిస్టర్ నూకయ్య సినిమాలో కనిపించాడు. ఆ తరవాత సినిమాలకు గుడ్ బై చెప్పాడు. అయితే రాజా ప్రస్తుతం ఎందుకు కనిపించడంలేదు. ఏం చేస్తున్నాడన్నది చాలా మందికి తెలియదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజా తాను పాస్టర్ గా మారానని తెలిపారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ అనే చర్చిని ప్రారంభించి రాజా పాస్టర్ గా మారిపోయారు. తన జీవితంలో ఎన్నో తప్పులు చేశానని కానీ తనను దేవుడు క్షమించాడని..దేవుడి పిలుపు మేరకే తాను పాస్టర్ గా మారానని రాజా చెబుతున్నారు. అంతే కాకుండా తన ట్రస్ట్ ద్వారా రాజా ఎంతో మంది పేదలకు సహాయం చేస్తున్నారు. ఇక హీరోగా ఉన్నప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడిలా కనిపించిన రాజా ప్రస్తుతం గుర్తుపట్టలేనంతగా మారిపోయారు.
ALSo REAd :
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఎవరెవరు ఏం చదువుకున్నారో తెలుసా…? ఆ ముద్దుగుమ్మ అందరికంటే గ్రేట్…!