డిగ్రీ తృతీయ సంవత్సరం పరీక్షలు రాసి వచ్చిన విద్యార్థులు ఇంటి దారి పట్టారు. అక్కడ అంతా కోలహాలంగా మారింది. ఇంతలోనే కళాశాల రెండవ అంతస్తు నుండి ఓ విద్యార్థిని దూకడం కలకలం రేకెత్తించింది. ఆ విద్యార్థినిని వెంటనే గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. రెండవ అంతస్తు నుంచి దూకినా చిన్న చిన్న గాయాలతో యువతి ప్రాణాలతో బయటపడింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు యువతి వద్ద నుంచి పూర్తి వివరాలను సేకరించారు.
Advertisement
చేబ్రోలు మండలం పాతరెడ్డి పాలెంకు చెందిన పవన్‌కుమార్ అదే గ్రామానికి చెందిన కావ్య ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. ఇంతలోనే ఏమైందో ఏమో తెలియదు కానీ.. కావ్యను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. ఇదిలా ఉండగానే.. పవన్ కుమార్ పెద్దలు చూసిన యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. తుళ్లూరు మండలం ఆలపాడుకు చెందిన మాధవితో పవన్ వివాహం జరగాల్సి ఉంది. వధువు కుటుంబ సభ్యులు అంగరంగ వైభవంగా పెళ్లి కూతురిని తీసుకొని వరుడి ఇంటికి చేరుకున్నారు. ఇంతలోనే ఇంట్లో పెళ్లి కొడుకు లేడని అందరూ ఆశ్చర్యపోయారు. ఏం జరిగిందా అని ఆరా తీస్తే.. పవన్ కుమార్‌ను అరెస్ట్ చేసినట్టు తెలిసింది. తమను మోసం చేశారని వధువు బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి ఇరు కుటుంబాలకు సర్ది చెప్పడంతో ముందుగా తీసుకున్న కట్నం, కానుకలను వరుడి తల్లిదండ్రులు తిరిగి ఇచ్చారు. ఇక చేసేది ఏమిలేక పెళ్లి కూతురుని తీసుకొని వెళ్లారు.
Advertisement
అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రేమించిన కావ్యను పెళ్లి చేసుకోవడం పవన్ తల్లిదండ్రులకు ఇష్టం లేదట. దీంతో కావ్యకు బైబై చెప్పి తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని చేసుకోవాలనుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కావ్య సరిగ్గా పవన్-మాధవిల పెళ్లికి రెండు రోజుల ముందే సూసైడ్ చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని పవన్ అరెస్ట్ చేసారు. బెయిల్ పై బయటికి తీసుకొచ్చి చేద్దాం అనుకుంటే పవన్ తల్లిదండ్రుల ఆటలు సాగలేదు. ప్రేమించిన యువతిని మోసం చేసినందుకు జైలు పాలయ్యాడు పవన్.
Also Read :
సౌందర్య చనిపోయిన తర్వాత ఆమె భర్త పరిస్థితి ఎలా ఉందో తెలుసా..!
“శేఖర్” మూవీతో నిండా మునిగినట్టేనా.. ఏం జరిగిందంటే..?