Home » టార్గెట్ 1000 కోట్లు.. సాధించే సత్తా ఉన్న రాబోయే సినిమాలు ఇవేనా..!!

టార్గెట్ 1000 కోట్లు.. సాధించే సత్తా ఉన్న రాబోయే సినిమాలు ఇవేనా..!!

by Sravanthi
Ad

తెలుగు ఇండస్ట్రీలో కానీ ఇతర ఇండస్ట్రీల్లో కానీ సినీ ప్రపంచం చాలా వేగంగా దూసుకుపోతోంది. ఒకప్పుడు సినిమా తీశారు అంటే వారు పెట్టిన బడ్జెట్ కు కొంత ఎక్కువ వస్తే చాలు అనుకునేవారు. కానీ ప్రస్తుత కాలంలో ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేసి వెయ్యి కోట్లు సాధించే టార్గెట్ ను క్రియేట్ చేస్తున్నారు మూవీ యూనిట్. ఇప్పటికే బాహుబలి, కే జి ఎఫ్ 2, ఆర్ఆర్ఆర్, దంగల్ మూవీలు వెయ్యి కోట్లకు పైగా సాధించి రికార్డు సృష్టించాయి. అయితే ఇదే తరహాలో రికార్డులు సాధించడం కోసం వస్తున్న పాన్ ఇండియా సినిమాలు ఏంటో చూద్దాం..!!

1.PS-1
మూవీ ఈ సినిమా దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది ఈ సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీన రిలీజ్ కాబోతోంది. దీనికి గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. విక్రమ్,కార్తీ, ఐశ్వర్య రాయ్,త్రిష వంటి ప్రధాన కథానాయకులు ఇందులో నటిస్తున్నారు.

Advertisement

 

2 టైగర్ 3
ఈ మూవీ ఏప్రిల్ 21,2023 వ సంవత్సరంలో విడుదల కాబోతోంది. ఈ సినిమాకు డైరెక్టర్ మణిశర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సల్మాన్ ఖాన్ మరియు కత్రినాకైఫ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా 340 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

Advertisement

3 బ్రహ్మాస్త్ర
ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. దీన్ని శివుని కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది సెప్టెంబర్ 9 2022 న రిలీజ్ కాబోతుంది. ఇందులో రణ్ బీర్ కపూర్, అలియా భట్,కింగ్ నాగార్జున కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

4 ఇండియన్ 2
ఈ సినిమా శంకర్ డైరెక్షన్ లో రెండు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ మూవీ కూడా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నారు. ఇందులో ముఖ్య పాత్ర లో కమల్ హాసన్, కాజల్ నటించనున్నారు. ఈ మూవీని భారతీయుడు సీక్వెల్ గా తీస్తున్నారు.

also read;

పుష్ఫ సినిమాలో సీన్లు చూసి సుకుమార్ ను కొట్టావా..? క‌రాటే క‌ల్యాణిపై శ్రీరెడ్డి ఫైర్..!

తగ్గేదే లే అంటూ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న సర్కారు వారి పాట.. ఎన్ని కోట్లు అంటే..!!

 

 

Visitors Are Also Reading