Home » తగ్గేదే లే అంటూ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న సర్కారు వారి పాట.. ఎన్ని కోట్లు అంటే..!!

తగ్గేదే లే అంటూ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న సర్కారు వారి పాట.. ఎన్ని కోట్లు అంటే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో యాక్టింగ్, డాన్స్, ఫైట్స్ అన్నింటికిమించి హ్యాండ్సమ్ లుక్స్ తో ప్రేక్షకులను సుదీర్ఘకాలంగా అలరిస్తూ స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. కెరీర్ ప్రారంభం నుంచే ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తూ ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. తన మార్కెట్ ను కూడా భారీగా పెంచుకున్నాడు. ఇక ఈ మధ్య కాలంలో హ్యాట్రిక్ హిట్ లను అందుకున్న మహేష్ సర్కారు వారి పాట అనే సినిమాను చేశాడు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మూడు రోజుల్లో ఎంత వసూలు చేసింది ఇంకెన్ని వస్తే హిట్ అవుతుంది అనేది తెలుసుకుందాం.
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు పరశురాం దర్శకత్వం వహించారు. ఇందులో సముద్రఖని విలన్ పాత్రలో చేశారు.

క్రేజీ కాంబినేషన్ లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా విడుదలైన సర్కారు వారి పాట మూవీపై ఆరంభం నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా థియేట్రికల్ హక్కులకు అన్ని ప్రాంతాల్లోనూ పోటీ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలుపుకొని ఈ సినిమాకు 120 కోట్ల మేర బేరాలు జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. సర్కారు వారి పాటకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడవరోజు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో నైజాంలో 5.36 కోట్లు, సీడెడ్ లో 1.42 కోట్లు ,ఉత్తరాంధ్రలో1.95 కోట్లు, ఈస్ట్ లో 1.06 కోట్లు, వెస్ట్ లో 45 లక్షలు, గుంటూరులో 46 లక్షలు, కృష్ణా లో 92 లక్షలు, నెల్లూరులో 39 లక్షలతో కలిపి 12.01 కోట్ల షేర్, 18.10 కోట్ల గ్రాస్ వచ్చింది.

Advertisement

Advertisement

తెలుగు రాష్ట్రాల్లో సర్కార్ వారి పాట సినిమా మూడు రోజుల్లో బాగా కలెక్షన్ లను రాబట్టింది. ఫలితంగా నైజాంలో 22.48 కోట్లు,సీడెడ్ లో 7.38 కోట్లు, ఉత్తరాంధ్రలో 7.34 కోట్లు, ఈస్ట్ లో 5.39 కోట్లు, వెస్ట్ లో 3.64 కోట్లు, గుంటూరులో 6.80 కోట్లు, కృష్ణ లో 3.75 కోట్లు, నెల్లూరులో 2.30 కోట్లతో కలిపి 59.06 కోట్ల షేర్, 84.40 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మిగిలిన ప్రాంతాల్లో కూడా సత్తా చాటింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 121 కోట్లుగా నమోదైంది. ఈ సినిమా మూడు రోజుల్లో 72.22 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 48.78 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్ స్టేటస్ కి చేరుతుంది.

also read;

రాజీవ్ గాంధీ హత్యకు మురారి సినిమాకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా…!

డైరెక్షన్ రాకపోయినా “శేషు” సినిమాకు జీవిత ఎందుకు దర్శకత్వం వహించిందో తెలుసా…!

 

 

Visitors Are Also Reading