తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల మూవీస్ రిలీజ్ అయితే చాలు థియేటర్ల ముందు ఆ సందడే వేరు.. తాజాగా మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట సినిమాలో ఇలాగే జరిగింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన మొదటి రోజు కలెక్షన్ల మోత మోగించింది అని చెప్పవచ్చు. మరి టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ మూవీస్ ఏంటో ఒకసారి చూద్దాం..!!
బాహుబలి 2 : జక్కన్న దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఈ మూవీ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు 123 కోట్ల షేర్ రాబట్టింది.ఆర్ ఆర్ ఆర్ : దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కింది. ఈ మూవీ ప్రపంచం మొత్తం బాక్సాఫీస్ వద్ద 135 కోట్ల వసూళ్లను రాబట్టి రికార్డుల్లో టాప్ ప్లేస్ లో నిలిచింది.సాహో : బాహుబలి మూవీ తర్వాత వచ్చిన సినిమా సాహో. ఈ మూవీ మొదటి రోజే 73.64 కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డు సాధించింది.బాహుబలి : జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మొదటిరోజు బాక్సాఫీస్ వద్ద రెండు తెలుగు రాష్ట్రాల్లో 22.4 నాలుగు కోట్లు, ప్రపంచ వ్యాప్తంగా 46 కోట్ల షేర్ రాబట్టింది.సర్కారు వారి పాట : పరశురాం దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా మొదటిరోజు 36.01 కోట్ల రూపాయలు రాబట్టి 5వ స్థానంలో నిలిచింది అని చెప్పవచ్చు.రాదే శ్యాం : భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా 40 కోట్ల షేర్ వసూలు చేసింది.సరిలేరు నీకెవ్వరు: మహేష్ బాబు హీరోగా అనిల్ రాయపూడి కాంబోలో వచ్చింది మూవీ. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 43.16 కోట్లు వసూలు చేసింది.అజ్ఞాతవాసి : త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఈ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 39.30 కోట్లు వసూలు చేసింది.పుష్ప: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ. తెలుగు రాష్ట్రాల్లో24.90 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 38.49 కోట్ల రూపాయలు రాబట్టింది.
Advertisement
ALSO READ;
Advertisement
సర్కారు వారి పాట సినిమాకు ప్రభాస్, ఎన్టీఆర్ ఫాన్స్ సపోర్ట్ వెనుక ఇంత కథ ఉందా..!!
ఏపీ రాజకీయాలకు బలైన సర్కారు వారి పాట.. ఏమైందంటే..!!