Home » ఏపీ రాజకీయాలకు బలైన సర్కారు వారి పాట.. ఏమైందంటే..!!

ఏపీ రాజకీయాలకు బలైన సర్కారు వారి పాట.. ఏమైందంటే..!!

by Sravanthi Pandrala Pandrala

ఒకప్పుడు సినిమా అంటేనే రాజకీయాలకు దూరంగా ఉండేది. ఆనాటి కాలంలో సినిమా వేరు రాజకీయం వేరు. ఎవరి పనులు వారు చూసుకునే వారు. కానీ ప్రస్తుత కాలంలో సినిమా వాళ్ళు చాలా మంది రాజకీయ నాయకులు గా మారుతున్నారు. అలాగే రాజకీయ నాయకులు కూడా కొన్ని సినిమాల్లో పాత్రలు చేస్తున్నారు. అయితే ఈ రాజకీయం కారణంగానే సినిమా ఇండస్ట్రీ పాడవుతుంది అనేది ఇండస్ట్రీ వర్గాల్లో నలుగుతున్న అసలు సమస్య. తాజాగా మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట మూవీకి రాజకీయం పులుముకుంది. ఈ మూవీ విషయంలో బయట ఎక్కువ నెగిటివ్ ప్రచారం చేశారని తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తున్నది.. ఈ మూవీలో నేను విన్నాను నేను ఉన్నాను అనే జగన్ వాడిన డైలాగ్ పెట్టుకోవడం వల్ల ఈ సినిమా ఇలా ఉందంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ మూవీలో రాజకీయ డైలాగులు ఉండటం వలన సినిమా దొబ్బింది అంటూ కొందరంటున్నారు.. అయితే ఈ డైలాగ్ గురించి ట్రైలర్ వచ్చినప్పటి నుంచే ప్రతిపక్ష పార్టీ ఒక కన్ను వేసింది అని చెప్పవచ్చు. సినిమా విడుదలయ్యాక టాక్ ఇలా ఉండడంతో ఆ భారాన్ని మొత్తం జగన్ డైలాగ్ మీదనే వేశారు. ఇదే మూవీ హిట్ అయి ఉంటే మాత్రం ఈ ప్రస్తావన వచ్చేది కాదు. టిడిపి పార్టీ మీద వ్యతిరేకతతో వైసిపి వారు పార్టీ కి మద్దతుగా కానీ పాజిటివ్ గా గాని రివ్యూలను ఇవ్వలేదు అని చెప్పవచ్చు. అందుకే సినిమా అంత రీచ్ కాలేదని తెలుస్తోంది. అయితే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాత్రం సినిమా చాలా బాగుందని ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.

ALSO READ;

భీమ్లానాయక్ రికార్డ్ బ్రేక్ చేయడం మహేష్ వల్ల కూడా కాలేదా..!!

యాంటీ ఫ్యాన్స్ తో పెద్ద పెద్ద సినిమాలకు నష్టం వాటిల్లుతోందా..!!

 

Visitors Are Also Reading