ప్రస్తుతం ప్రపంచమంతా సోషల్ మీడియా హవా నడుస్తోంది. ఒకప్పుడు మనకు తెలియాల్సిన విషయాలు తెలియడానికే చాలా సమయం పట్టేది. ఇంకా బయట ప్రపంచం గురించి దేవుడెరుగు అన్నట్టు అప్పట్లో పరిస్థితి ఉండేది. కాని ఇప్పుడు సోషల్ మీడియా విచ్చలవిడిగా రాజ్యమేలుతున్న రోజుల్లో ఏ మూల చీమ చిటుక్కుమన్నా ఇట్టే క్షణాల్లో ప్రపంచానికి తెలిసిపోతోంది. దీంతో ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో విషయాలు మనకు వీడియోల రూపంలో ఫోటోల రూపంలో సోషల్ మీడియాలో నిత్యం వేలాదిగా దర్శనమిస్తుంటాయి. అలాంటివి మనం రోజూ ఏదో ఒక మాధ్యమాల్లో చూస్తూ ఉంటాం. అలా సామాజిక మాధ్యమాలలో కొన్ని వీడియోలు కావచ్చు వార్తలు నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారుతుంటాయి.
Advertisement
ఇంకా కొన్ని వార్తలు నెటిజన్లను ఓరా అనిపించక మానవు. అలా నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఓ వార్త నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారుతోంది. మామూలుగా మనుషులు నవ్వడం చూసి ఉంటాం.కానీ చెట్లు నవ్వడం చూసి ఉంటామా. లేదు కదా. చెట్లు నవ్వడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు కదా. కానీ మీరు చదివింది అక్షరాలా నిజం. బాధాకరమైన విషయం ఏంటంటే ఇటువంటి చెట్ల జాతి మెల్ల మెల్లగా అంతరించిపోతోంది. అయితే ఈ ఉత్తరాఖండ్ కళదుంగి అడవులలో ఉండే ఈ చెట్టు స్పెషాలిటీ ఏంటంటే ఈ చెట్టును ఎవరైనా తాకితే ఒక్కసారిగా చెట్టు మొదలు నుండి మొదలు కొని చివరి కొమ్మ వరకు ఊగుతుందట.
Advertisement
మామూలుగా గాలి వస్తేనే ఊగే ఈ చెట్టు ఎవరైనా తాకితే కితకితలు పెడుతున్నట్టు ఊగుతుడటంతో ఈ చెట్టు గురించి ప్రపంచం మొత్తం క్షణాల్లో ప్రపంచానికి తెలిసిపోయింది. అలా ఎలా సాధ్యం అంటూ కొందరు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా ఇలాంటి వాటిని కాపాడుకోవాలి అంటూ పలువురు నెటిజన్లు సూచనలు చేస్తున్నారు. ఇంకా కొందరు నెటిజన్లు ఇటువంటి చెట్టు కూడా ఉంటుందనే విషయం ఈ రోజే తెలిసిందంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్లను ఎంతగానో ఆసక్తికి గురి చేసిన ఈ చెట్టుపై మీరూ ఓ లుక్కేయండి.