తెలుగు ఇండస్ట్రీలో ఆల్ రౌండర్ నటుడు కోట శ్రీనివాసరావు అంటే తెలియని వారు ఉండరు. ఆయన చేసిన కొన్ని పాత్రలు ఇప్పటికీ గుర్తుండిపోతాయి.. విలనిజం లో నైనా, తండ్రి పాత్రలో అయినా, కామెడీ అయినా తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు అని చెప్పవచ్చు. తాజాగా ఆయన ఒక సందర్భంలో చిరంజీవిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే మెగాస్టార్ చిరంజీవి చిత్రపురి కాలనీలో ఆసుపత్రిని నిర్మిస్తానని చెప్పాడని అన్నారు.. అయితే కోట చిరంజీవి ఆస్పత్రి కడితే ఎవరు వస్తారని మొదట కార్మికులకు తిండి పెట్టాలని అన్నారు. ఎంతో టాలెంట్ ఉన్న చాలామంది కృష్ణానగర్ లో ఆకలితో అలమటిస్తున్నారు అని కూడా చెప్పుకొచ్చారు.. చిరంజీవి కార్మికుడు కాకున్నా కార్మికుడు అని చెబుతారని, కోట్ల రూపాయలు పారితోషికం తీసుకునే ఆయన ఏ విధంగా కార్మికుడు అవుతారని శ్రీనివాస రావు అడిగారు. చిరంజీవి అంటే తనకు చాలా గౌరవం ఉందని కానీ ఆయన చేసినటువంటి కామెంట్లు నాకు నచ్చావ్ అని చెప్పారు.. కార్మికుడు అని చెప్పుకునే చిరంజీవి కనీసం ఎవరికైనా రూపాయి సాయం చేస్తారా అని ప్రశ్నించారు.. ఇప్పటివరకు ఆయన సినిమాల్లో ఎవరికైనా ఆఫర్లు ఇప్పించారా అని అన్నారు.. ఎవరైనా తన ఇంటికి వస్తే 500 నుంచి 1000 రూపాయలు ఇచ్చి పంపుతారని కోట తెలియజేశారు.. కష్టాల్లో ఉన్న కార్మికులకు ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేశానని కోట అన్నారు. నేను చిరంజీవి లాగా అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పను అని అన్నారు. ఇలా కోట శ్రీనివాసరావు చిరంజీవి టార్గెట్ చేయడం సోషల్ మీడియా వేదికగా చాలా చర్చనీయాంశమైంది.. గతంలో కూడా ఆయన చిరంజీవిపై మండిపడ్డారు. మూవీ ఆర్టిస్ట్ ఎన్నికల్లో కూడా కోట మంచు విష్ణుకు సపోర్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే.
ALSO READ :
రాహుల్ రామకృష్ణ ఓ ఇంటి వాడు కాబోతున్నాడా..!!
దాని వల్ల ఆరేళ్ల పాటు బాధపడ్డా…నెటిజన్లతో సమంత ఎమోషనల్ కామెంట్స్…!