సినీ ఇండస్ట్రీలో ముఖ్యంగా ఎక్కడ ఏ ప్రోగ్రామ్ జరిగిన అక్కడ కచ్చితంగా యాంకర్ సుమ పక్కాగా ఉంటారు. సుమ యాంకరింగ్ గురించి ఇక ఎంత చెప్పినా తక్కువే. అయితే ఈ యాంకర్ పెద్ద పెను ప్రమాదం నుంచే తప్పించుకుందట. ఇటీవలే ఆమె జయమ్మ పంచాయితీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసినదే.
టాలీవుడ్ ఇండస్ట్రీలో సుమ తెలియని వారుండరు. పైగా ఆమె ఓ స్టార్ కావడంతో ఆమెకు మద్దతుగా నిలిచారు. ఈ సినిమా నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్తో ముందుకెళ్లుతుంది. ఈ సినిమా విడుదల అయ్యాక కూడా సుమ ప్రమోషన్లను మాత్రం ఆపలేదు. ఈ చిత్రం షూటింగ్లో ఆమె ప్రమాదానికి గురైన ఓ వీడియోను షేర్ చేస్తూ.. జయమ్మ కోసం తాము పడ్డ కష్టాన్ని తెలిపింది.
ఈ వీడియోలో ఒక కొండ ప్రాంతంలో షూటింగ్ జరుగుతుండగా.. అక్కడే ఉన్న రాళ్లను పట్టుకుని ఏదో ఆలోచిస్తూ ఉంది సుమ. అప్పుడే నీటి ప్రవాహం ఎక్కువగా రావడంతో ఆమె కాలు ఒక్కసారిగా జారడంతో కిందపడబోయింది. ఇంతలోనే రాయిని గట్టిగా పట్టుకుని తనను తాను అదపుచేసుకోవడంతో తృటిలో పెను ప్రమాదమే తప్పింది. వెంటనే చిత్ర యూనిట్ సుమను గట్టిగా పట్టుకుని పక్కకు తీసుకెళ్లారు. ఈ వీడియో షేర్ చేస్తూ.. సుమ తృటిలో తప్పిన ప్రమాదం అన్నట్టుగా క్యాప్షన్ పెట్టింది. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. జాగ్రత్తగా ఉండాలి కదా.. సుమ చూసుకోవాలి కదా.. అని కొందరూ దేవుడా పెద్ద ప్రమాదం తప్పిందని మరికొందరూ కామెంట్స్ పెడుతున్నారు.
Also Read :
యాంకర్ సుమ చేతి పై పచ్చబొట్టు…..ఆ పేరు ఎవరిది..?
Kajal Aggarwal : మగబిడ్డ పుట్టిన తరువాత మొదటి ఫోటో షేర్ చేసిన కాజల్ అగర్వాల్.. ఎలా ఉందంటే..?