Home » Kajal Aggarwal : మ‌గ‌బిడ్డ పుట్టిన త‌రువాత మొద‌టి ఫోటో షేర్ చేసిన కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఎలా ఉందంటే..?

Kajal Aggarwal : మ‌గ‌బిడ్డ పుట్టిన త‌రువాత మొద‌టి ఫోటో షేర్ చేసిన కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఎలా ఉందంటే..?

by Anji
Ad

టాలీవుడ్‌లో అగ్ర క‌థానాయిక‌గా ఓ ఊపు ఊపిన కాజ‌ల్ అగ‌ర్వాల్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌య‌మే అవ‌స‌రం లేదు. ఈ మ‌ధ్య కాలంలో ఈ ముద్దుగుమ్మ ఏం చేసినా అది వైర‌ల్ అవుతోంది.కెరీర్ ప‌రంగా దూసుకెళ్లుతున్న కాజ‌ల్ అగ‌ర్వాల్ అంత‌లోనే తాను ప్రేమించిన గౌత‌మ్ కిచ్లూను పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందే ఆచార్య సినిమాలో చిరంజీవి సినిమాలో న‌టించేందుకు అంగీక‌రించినా.. కానీ ఆమె ఆ సినిమాలో న‌టించ‌పోవ‌డం విశేషం. ఆస‌మ‌యంఓల‌నే క‌రోనా రావ‌డం.. లాక్‌డౌన్ విధించ‌డం.. ఆ త‌రువాత ఆమె పెళ్లి చేసుకోవ‌డం.. వెంట‌నే గ‌ర్భ‌వ‌తి కావ‌డం అన్ని చ‌క‌చ‌క జ‌రిగిపోయాయి. దాదాపు దశాబ్దం కాలం పాటు టాలీవుడ్‌లో కాజ‌ల్ స్టార్ హీరోయిన్‌గా కొన‌సాగింద‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు.


2020లో కాజ‌ల్ అగ‌ర్వాల్ గౌత‌మ్ కిచ్లును వివాహం చేసుకుంది. ఇటీవ‌లే పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మనిచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా కాజ‌ల్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. త‌న చెల్లి నిషా అగ‌ర్వాల్ బాట‌లోనే వెళ్ల‌నున్న‌ట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కాజ‌ల్ త‌న సినీ కెరీర్‌కు ఇంత‌టితో పుల్ స్టాప్ పెట్ట‌నున్న‌ట్టు స‌మాచారం. నిషా కూడా పెళ్లి తరువాత సినిమాల‌కు గుడ్ బై చెప్పేసింది. నిషాకు అప్ప‌టికి సినిమా అవ‌కాశాలు అంత‌గా లేవు. కానీ కాజ‌ల్‌కు చేతినిండా ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఇప్ప‌టికే ఆమె అగ్రిమెంట్ చేసిన ప‌లు ప్రాజెక్ట్‌ల‌ను కూడా ర‌ద్దు చేసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. అధికారికంగా కాజ‌ల్ మాత్రం ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

Advertisement

Advertisement


ప్ర‌స్తుతం కాజ‌ల్ న‌టించిన మూడు సినిమాలు విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి. కొడుకు పుట్టిన త‌రువాత కాజ‌ల్ అగ‌ర్వాల్ మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తోంది. తాజాగా త‌న‌కు సంబంధించిన ఓ క్యూట్ ఫోటోను షేర్ చేసింది. ఇందులో కాజ‌ల్‌ క్యూట్ లుక్స్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ అమ్మడు అంద‌చందాలను చూసి అభిమానుల మ‌తిపోతుంది. రాబోయే రోజుల్లో కాజ‌ల్ మ‌రింత ఫిట్‌నెస్‌తో కంబ్యాక్ ఇవ్వ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ల‌క్ష్మీక‌ల్యాణం సినిమాతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన కాజ‌ల్ అగ‌ర్వాల్ రానున్న రోజుల్లో మ‌రిన్ని సినిమాల్లో న‌టిస్తుందో లేక త‌న సినీ కెరీర్‌కు స్వ‌స్తీ చెబుతుందో అనేది మ‌రికొద్ది రోజుల్లో తేల‌నుంది.

Also Read : 

ఎన్టీఆర్ ఆహార‌పు అల‌వాట్లు ఎలా ఉంటాయో తెలుసా?

గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేస్తే ఇలా జరుగుతుందా..!!

Visitors Are Also Reading