భూమి మీద బ్రతికే ప్రతి ఒక్కరికీ కష్టాలు ఉంటాయి. కష్టాలు రావడం, సుఖాలు రావడం చాలా సహజం. అయితే ఎంత పెద్ద కష్టం వచ్చినా తెగించి చివరి వరకు కొట్లాడతాం. ఇంకా కొందరు మానసికంగా బలహీనంగా ఉన్న వారు ఆత్మహత్యలకు ప్రయత్నిస్తారు. కాని తమ పిల్లలను మాత్రం అమ్ముకోవడానికి సిద్దపడరు. ఎంత కష్టమచ్చినా ఆస్తులు అమ్ముకుంటారు కాని పిల్లలను ఎవరైనా అమ్ముకుంటారా అని మీరు అనుకుంటున్నారు కదా. కాని కొన్ని సార్లు మనకు చూడడానికి కొంత హృదయవిదారకంగా ఉన్నా తప్పదు. ఇక అసలు విషయానికొస్తే పాకిస్థాన్ దేశానికి చెందిన ఒక పోలీసు నడి రోడ్డుపై యాభై వేల రూపాయల కొరకు తన కొడుకును అమ్మకానికి పెట్టారు. నడి రోడ్డుపై గట్టిగట్టిగా అరుస్తూ తన బిడ్డను ఎవరైనా కొనుక్కోండి అంటూ రోడ్డుపై వెళ్ళే వారిని ప్రాధేయపడుతున్నారు. అయితే ఈ పోలీసు తన కొడుకును అమ్ముకోవడానికి గల కారణమేమిటంటే తన కొడుకు ఆసుపత్రికి తీసుకెళ్లడం కోసం తన పై స్థాయి అధికారిని సెలవు అడిగితే అతను సెలవు ఇవ్వడానికి నిరాకరించాడు.
Advertisement
Advertisement
అంతేకాక సెలవు ఇవ్వాలంటే లంచం డిమాండ్ చేశారు. అయితే లంచం ఇవ్వడానికి ఈ పోలీసు అంగీకరించకపోవడంతో సెలవు క్యాన్సిల్ చేయడమే కాక, సిటీకి 120 కిలీమీటర్ల దూరం ఉండే లర్ఖానాకు ట్రాన్స్ ఫర్ చేశారు. అయితే సదరు పోలీసు అధికారి మాట్లాడుతూ లంచం ఇవ్వనందుకే నా సెలవు క్యాన్సిల్ చేయడమే కాక నన్ను ట్రాన్స్ ఫర్ చేశారని, నేను పేదవాడినని నా పైస్థాయి అధికారిపై కంప్లైంట్ చేయడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవని సదరు పోలీసు అధికారి మాట్లాడుతున్న తీరు నెటిజన్లను కంటతడి పెట్టిస్తున్నాయి. ఇటువంటి కష్టం ఎవరికి రాకూడదని, సదరు పోలీసు అధికారి నిస్సహాయంగా ఉన్నారని అందుకే ఇటువంటి ఆలోచన వచ్చిందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.