Home » అర్జున్ టెండూల్కర్ ఎంట్రీ పై కోచ్ కీలక వ్యాఖ్యలు..!

అర్జున్ టెండూల్కర్ ఎంట్రీ పై కోచ్ కీలక వ్యాఖ్యలు..!

by Azhar
Ad
ఐపీఎల్ లో అత్యధికంగా 5 సార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ఈ ఏడాది మాత్రం దారుణంగా ఆడుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ ప్రారంభం నుండి జట్టు సరిగా సెట్ కాకపోవడంతో వరుసగా 8 మ్యాచ్ లు ఓడిపోయి ఓ చెత్త రికార్డును క్రియేట్ చేసిన ముంబై జట్టు.. చివరగా రాజస్థాన్ తో ఆడిన 9వ మ్యాచ్ లో విజయం సాధించి ఐపీఎల్ 2022 లో ఖాతా తెరిచింది.
అయితే ముంబై జట్టు వరుసగా విఫలమవుతున్న సమయంలో.. ఆ ఆజట్టుతో ఉన్న సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ను ఆడించాలని అనే డిమాండ్ అభిమానుల నుండి భారీ ఎత్తున వచ్చింది. అయిన అర్జున్ కు మాత్రం ఆవకాశం రాలేదు. అయితే తాజాగా ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేళ జయవర్దనే.. ముమాబీ జట్టులోకి అర్జున్ ఎంట్రీ పై కీలక వ్యాఖ్యలు చేసాడు.
అర్జున్ ఎంట్రీ ఎప్పుడు అని అడిగిన ప్రశ్నకు జయవర్దనే మాట్లాడుతూ.. అది జట్టు కాంబినేషన్ పైన ఆధారపడి ఉంటుంది. మాకు అర్జున్ తో పాటుగా జట్టులో ఉన్న ప్రతి ఆటగాడు కూడా ఒక ఆప్షన్. అందుకే పరిస్థితులను బట్టి.. జట్టు కాంబినేషన్ ను బట్టి మేము జట్టును ఎంపిక చేస్తాం. విజయాల కోసం మంచి ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంటాం. అందులో అర్జున్ ను ఆడించాల్సిన పరిస్థితి.. కాంబినేషన్ వస్తే ఆడిస్తాం. అయితే మేము చివరి మ్యాచ్ లో మా మొదటి విజయం అందుకున్నాము. అందుకే ఈ కాంబినేషన్ ను మార్చాలి అనుకోవడం లేదు అని జయవర్దనే అన్నాడు.
ఇవి కూడా చదవండి :

Advertisement

Visitors Are Also Reading