Telugu News » Blog » కోహ్లీ, రోహిత్ లు రెస్ట్ తీసుకోవాల్సిందే..!

కోహ్లీ, రోహిత్ లు రెస్ట్ తీసుకోవాల్సిందే..!

by Manohar Reddy Mano
Ads
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2022 లో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ దారుణంగా విఫలమవుతున్న సంగతి తెలిసిందే. దాంతో వీరిపైన అభిమానుల నుండి చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇక మాజీ ఆటగాళ్లు అయితే వీరిద్దరూ కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని ఆడితే మంచింది అని సూచిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ దిగ్గజ ఆటగాళ్ల ఫామ్ పైన బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ కూడా స్పందించారు.
ఎంఎస్కే ప్రసాద్ మాట్లాడుతూ… ప్రస్తుతం కోహ్లీ, రోహిత్ కు కష్టమైనా సమయం నడుస్తుంది. ఇది ప్రతి ఆటగాడికి వచ్చేదే. అందువల్ల వీరిద్దరూ తప్పకుండ కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే మంచింది. ఈ ఏడాది జరిగే ఆసియా కప్ లో రాణించాలంటే.. ఐపీఎల్ ముగిసిన తర్వాత వీరు రెస్ట్ తీసుకోవాలి ఉంటుంది అని ప్రసాద్ తెలిపారు.
అదే విధంగా ఈ ఐపీఎల్ లో బాగా రాణిస్తున్న సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ ను టీ20 ప్రపంచ కప్ కు ఎంపిక చేయాలి. ఈ మెగా టోర్నీలో అతని అనుభవం బాగా పనికస్తుంది. రోహిత్ తో కలిసి ధావన్ ఓపెన్ చేస్తే.. కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్ లో 4వ స్థానంలో బ్యాటింగ్ చేయడం జట్టుకు చాలా మంచింది. గతంలో కూడా రాహుల్ మిడిల్ ఆర్డర్ లో రాణించాడు అని ప్రసాద్ గుర్తు చేసారు.
ఇవి కూడా చదవండి :