Home » జయం సినిమాలో సదా చెల్లెలిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా…? ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా..!

జయం సినిమాలో సదా చెల్లెలిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా…? ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా..!

by AJAY
Ad

నితిన్ సదా హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా జయం. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలోని నటీనటులు ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రంలో సదా చెల్లెలిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ప్రేక్షకుల మనసు దోచుకుంది. అయితే జయం సినిమాలో సధా చెల్లెలు గా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ మరెవరో కాదు. టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న న‌టి జయలక్ష్మి కూతురు యామిని శ్వేత.

Advertisement

 

అయితే ఈ సినిమా తర్వాత యామిని శ్వేత మరే సినిమాలోనూ కనిపించలేదు. ఎన్నో అవకాశాలు వచ్చినా కూడా యామిని శ్వేత సినిమాలకు దూరంగా ఉన్నారు. హీరోయిన్లను తలపించే అందం ఉన్నా కూడా యామిని శ్వేత సినిమాలకు ఎందుకు దూరంగా ఉన్నారు. అవకాశాలు వచ్చినా ఎందుకు నో చెప్పారు అన్న సంగతి ఇప్పుడు చూద్దాం….ఓ ఇంట‌ర్వ్యూలో యామిని శ్వేత తల్లి విజయలక్ష్మి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

సినిమా ఇండస్ట్రీ లో తన జీవితాన్ని నిలబెట్టుకోవడానికి చాలా బాధలు పడాల్సి వచ్చిందని జయ‌లక్ష్మి అన్నారు. ఆ బాధలు తన కూతురు పడకూడదని అన్నారు. తన కూతురిని బాలనటిగా చూడాలని ఆశ ఉండేదని ఆ కోరిక తీరిందని చెప్పారు. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో చాలా అవకాశాలు వచ్చాయి కానీ తను ఓకే చెప్పలేదని అన్నారు. ప్రస్తుతం తన కూతురు పెళ్లి చేసుకుని అమెరికాలో సంతోషంగా ఉందని చెప్పారు.

తన మాటను కూతుర్లు ఎప్పుడూ కాద‌న‌లేదని ఇంతకన్నా సంతోషం ఇంకేం కావాలి అన్నారు. ఇదిఇలా ఉంటే యామిని శ్వేత ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు. వివాహం చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చారు కూడా. అంతేకాకుండా యామిని శ్వేతకు విజయవాడలోనూ భారీగా ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ జయం చైల్డ్ ఆర్టిస్ట్ అంటూ యామిని శ్వేత ఫోటోలు నెట్టింట‌ వైరల్ అవుతున్నాయి.

ALSO READ :

అన్నగారిని స్టైలిష్ స్టార్ ను చేసిన సినిమా ఏదో తెలుసా…? ఈ సినిమా తరవాతే యూత్ ఐకాన్ అయ్యాడు…!

ఇన్స్టాలో రీఎంట్రీ ఇచ్చిన మెగాడాట‌ర్…ఈ ప్రపంచం ఇంకా అంతం కాలేదంటూ..!

Visitors Are Also Reading