Home » అన్నగారిని స్టైలిష్ స్టార్ ను చేసిన సినిమా ఏదో తెలుసా…? ఈ సినిమా తరవాతే యూత్ ఐకాన్ అయ్యాడు…!

అన్నగారిని స్టైలిష్ స్టార్ ను చేసిన సినిమా ఏదో తెలుసా…? ఈ సినిమా తరవాతే యూత్ ఐకాన్ అయ్యాడు…!

by AJAY
Ad

తెలుగు సినిమా చరిత్ర గురించి మాట్లాడుకోవాలంటే స్వర్గీయ ఎన్టీఆర్ గురించి చెప్పుకోవాల్సిందే. ఎన్టీఆర్ తెలుగు చిత్రసీమలో చెరగని ముద్ర వేసుకున్నారు. విలక్షణమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను అబ్బురపరిచారు. ఇక ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి అడవి రాముడు సినిమా. ఈ సినిమా అప్పట్లో ట్రెండ్ సెట్ చేసింది. ఈ చిత్రానికి కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా… సత్యనారాయణ, సూర్యనారాయణ సంయుక్తంగా నిర్మించారు. సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా జయసుధ, జయప్రద నటించి అలరించారు.

Advertisement

 

ఈ సినిమా తర్వాత జయప్రద, జయసుధ స్టార్ హీరోయిన్ లుగా మారిపోయారు. కె. రాఘవేంద్రరావు కూడా ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు. ఇక ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈ సినిమా లోని ఆరేసుకోబోయి పారేసుకున్నాను అనే పాట కోటి రూపాయల పాటగా అప్పట్లో ట్రెండ్ సెట్ చేసింది. ఇప్పటికీ ఈ పాటకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. 1977లో వచ్చిన అడవి రాముడు సినిమా అప్పటివరకు వచ్చిన సినిమాలకు భిన్నంగా ఉంటుంది. ఈ సినిమాతోనే కమర్షియల్ సినిమాలు టాలీవుడ్ లో మొదలయ్యాయని చెప్పాలి.

Advertisement

దానికి ముందు తెలుగు సినిమాలలో అన్ని పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. కమెడియన్ లకు కూడా పాటలు ఉండేవి. కానీ అడవి రాముడు సినిమా హీరోయిజం ను చూపించి పక్కా కమర్షియల్ సినిమాగా తెరకెక్కింది. ఎన్టీఆర్ చుట్టే ఈ సినిమా కథ మొత్తం తిరుగుతుంది. అంతే కాకుండా ఈ సినిమా చేసిన సమయంలో ఎన్టీఆర్ వయస్సు ఐదు పదులు దాటింది.

కానీ స్క్రీన్ పై మాత్రం ఎన్టీఆర్ లుక్ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రంతోనే ఎన్టీఆర్ ఎంతో స్టైలిష్ కనిపించి స్టైల్ కా బాప్ అనిపించుకున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఆర్ స్టైల్ కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అప్పట్లో యూత్ అంతా ఎన్టీఆర్ ని ఫాలో అయ్యారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ వేసుకున్న డ్రెస్సింగ్ ఆయన మేనరిజం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సినిమాలో ఎన్టీఆర్ సూట్ లు బూట్ కట్ ప్యాంట్ లతో కనిపిస్తున్నారు. ఈ సినిమా తరవాత చాలా కాలం పాటు బూట్ కట్ ప్యాంట్ పా ట్రెండ్ కొనసాగింది.

Also read :

కథ నచ్చినా వాళ్ళ కోసమే కృష్ణ “స్నేహంకోసం”” సినిమాను రిజెక్ట్ చేశారన్న సంగతి తెలుసా…!

ఆచార్య న‌టించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవ‌రో తెలుసా…సినిమా ఛాన్స్ ఎలా వ‌చ్చిందంటే..!

Visitors Are Also Reading