Home » ఇన్స్టాలో రీఎంట్రీ ఇచ్చిన మెగాడాట‌ర్…ఈ ప్రపంచం ఇంకా అంతం కాలేదంటూ..!

ఇన్స్టాలో రీఎంట్రీ ఇచ్చిన మెగాడాట‌ర్…ఈ ప్రపంచం ఇంకా అంతం కాలేదంటూ..!

by AJAY
Published: Last Updated on
Ad

మెగాడాట‌ర్ నిహారిక ప‌రిచయం అక్క‌ర్లేని పేరు. మెగాఫ్యామిలీ నుండి న‌ట‌న‌లోకి అడుగుపెట్టిన ఏకైక మ‌హిళ కూడా నిహారికనే. ఇక నిహారిక మొద‌ట యూట్యూబ్ లో వెబ్ సిరీస్ లు నిర్మించ‌డంతో పాటూ అందులో న‌టించి ఆక‌ట్టుకుంది. ఆ త‌ర‌వాత ఢీ జూనియ‌ర్స్ డ్యాన్స్ షోకు యాంకర్ గా వ్య‌వ‌హ‌రించింది. ఈ షోలో టైమ్ కు త‌గిన‌ట్టు పంచ్ లు వేయ‌డంతో నిహారిక అభిమానుల‌ను సంపాదించుకుంది. ఆ త‌ర‌వాత నిహారిక ఏకంగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

Advertisement

 

అయితే హీరోయిన్ గా మాత్రం నిహారిక స‌క్సెస్ అందుకోలేక‌పోయింది. ఇదిలా ఉండ‌గానే నిహారిక త‌న స్నేహితుడు చైత‌న్య‌ను బంధువులు కుటుంబ స‌భ్యుల మ‌ధ్య‌న వివాహం చేసుకుంది. వీరి వివాహం రాజస్థాన్ లోని జోద్ పూర్ లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఇక పెళ్లి త‌ర‌వాత నిహారిక న‌ట‌న‌కు గుడ్ బై చెప్పింది. అయితే నిర్మాత‌గా మాత్రం కొన‌సాగుతాన‌ని చెప్పింది.

Advertisement

ఇదిలా ఉంటే ఇటీవ‌ల నిహారిక అర్థ‌రాత్రి త‌ర‌వాత ప‌బ్ లో ఉన్నార‌నే కార‌ణంతో నిహారిక తో పాటూ మ‌రికొంద‌రిని పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. దాంతో నిహారిక పై సోష‌ల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ వ‌చ్చాయి. అయితే ఆ ట్రోల్స్ ను ఖండిస్తూ నాగ‌బాబు స‌మాధానం ఇచ్చారు. ఇక కొంత‌కాలంగా నిహారిక సోష‌ల్ మీడియాకు కూడా దూరంగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలో నిహారిక ఇన్స్టా గ్రామ్ నుండి క‌నిపించ‌కుండా పోయింది. అయితే తాజాగా నిహారిక త‌న అకౌంట్ ను తిరిగి యాక్టివేట్ చేసుకుంది. అంతే కాకుండా ఓ పోస్ట్ కూడా చేసింది. పోస్ట్ లో నిహారిక ఇన్స్టాగ్రామ్ నుండి దూర‌మైన 8 వారాలలో నేను మూడు విష‌యాల‌ను నేర్చుకున్నాను. ఈ ప్ర‌పంచం ఇంకా అంతం కాలేదు. ఇత‌రులు ఏం చేస్తున్నారో నేను ప‌ట్టించుకోను. ఇప్పుడు నేను నిజంగా రీఫ్రెష్ అయ్యాను. అంటూ నిహారిక త‌న పోస్ట్ లో పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైర‌ల్ అవుతోంది.

Visitors Are Also Reading