Home » బ్రహ్మానందం కి ఏమైంది.. సినిమాల్లో కనిపించకపోవడానికి కారణం ఏంటో తెలుసా..!!

బ్రహ్మానందం కి ఏమైంది.. సినిమాల్లో కనిపించకపోవడానికి కారణం ఏంటో తెలుసా..!!

by Sravanthi Pandrala Pandrala

ఎవరి ఫేసు కనబడితే పొట్టచెక్కలయ్యేలా నవ్వు వస్తుందో, ఎవరిని చూస్తే ఏడ్చేవాడు కూడా నవ్వుతారు. ఆయనే బ్రహ్మానందం. ఆయన పేరులోనే ఉంది ఆనందం. బ్రహ్మ ఆయన పుట్టించిందే పది మందిని సంతోషంగా ఉంచడం కోసం కావచ్చు. సినిమాల్లో ఆయన నటన చూస్తే నవ్వని వారు ఉండరు. మరి ఆయన గతంలో లాగా ఇప్పుడు సినిమాలు చేయడం లేదు.

గతంలో ప్రతి సినిమాలో ఆయన కామెడీ కష్టంగా ఉండేది. మరి ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదు మీకు తెలుసా..!! అప్పట్లో బ్రహ్మానందం లేకుండా అసలు సినిమానే ఉండేది కాదు. స్టార్ హీరో సినిమా అయినా సరే బ్రహ్మానందం తప్పనిసరిగా ఉండేవారు. అంటే ఆయనకు అంత క్రేజ్ ఉంది. అయితే కొన్ని రోజులుగా వివిధ కారణాలతో బ్రహ్మానందం సినిమాలకు దూరంగా ఉన్నారు.

దానికి ముఖ్య కారణం పారితోషికం అని తెలుస్తోంది. మరికొందరేమో సర్జరీ వల్ల ఇండస్ట్రీకి దూరం అయ్యారు అని అంటున్నారు. అయితే బ్రహ్మానందం ఒక రోజుకు 5 లక్షల రూపాయల పారితోషికం తీసుకుంటారు. అయినా ఆయనకు ఆఫర్లు అనేక వచ్చేవని, కానీ ఇప్పుడు ఆ స్థాయిలో రావడంలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన పంచతంత్రం అనే మూవీలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారని సమాచారం.

ALSO READ :

బాలీవుడ్ గురించి కిచ్చ సుదీప్ ఏమ‌న్నారో తెలుసా..?

ఎన్టీఆర్ నవ్వుకున్నా చోటే నిలబడిన డి రామానాయుడు…!

 

 

Visitors Are Also Reading