Home » ఎన్టీఆర్ నవ్వుకున్నా చోటే నిలబడిన డి రామానాయుడు…!

ఎన్టీఆర్ నవ్వుకున్నా చోటే నిలబడిన డి రామానాయుడు…!

by Azhar
Ad

ప్రస్తుతం మన తెలుగులో ఎంతో మంది ప్రొడ్యూసర్లు ఉండవచ్చు. కానీ ఎప్పటికి తెలుగు ప్రొడ్యూసర్లలో మొదటి స్థానంలో ఉండేది డి రామానాయుడు. ఎందుకంటే.. ఆయన కేవలం తెలుగులోనే కాదు.. మన ఇండియాలో ఉన్న అన్ని భాషల్లో సినిమాలు తీసి హిట్ అందుకున్నారు. అలాగే ఆయన నిర్మించిన సినిమాల్లో దాదాపు అన్ని మంచి విజయాలు అందుకున్నాయి. అయితే పెద్ద ఎన్టీఆర్, డి రామానాయుడు మధ్య అప్పట్లో ఓ ఘటన జరిగిందట..!

Advertisement

అదేంటంటే..అప్పుడప్పుడే మద్రాస్ నుండి మన హైదరాబాద్ కు ఇండస్ట్రీ వస్తుంది. దాంతో అప్పటి ప్రభుత్వం ఏఎన్ఆర్ గారికి స్థలం ఇవ్వగా.. ఆయన అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారు. అప్పుడే రామానాయుడి గారికి కూడా స్థలం కావాలా అంటే వద్దు అన్నారట. కానీ ఆ తర్వాత ఆయన నిర్మించిన సెక్రటరీ అనే సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ లో తీశారు. ఇందులో తీసిన మొదటి సినిమా కూడా ఇదే..! దీని ఓపెన్ చేయడానికి వచ్చిన నాగిరెడ్డి గారు ఇలా కొండల్లో స్టూడియో కడితే బాగుంటుంది అనడంతో రామానాయుడు గారు స్టూడియో కట్టాలని నిర్ణయించుకున్నారు.

Advertisement

ఆ తర్వాత రామానాయుడు గారికి కూడా ప్రభుత్వం స్థలం ఇచ్చింది. కానీ అప్పుడే ఎన్టీఆర్ గారు ఈ కొండల్లో ఏం స్టూడియో కడతావ్ అంటే.. ఇక్కడి నుంచి వ్యూ బాగుంది సార్ అని చెబితే..నీకు వ్యూ కావాలా.. బిజినెస్ కావాలా అని నవ్వారట..! కానీ రామానాయుడు గారు మాత్రం వెన్నకి తగ్గకుండా.. తన ఆస్తి మొత్తం ఆ కొండలను కరిగించడానికి పెట్టి అద్భుతమైన స్టూడియో కట్టారు.

ఇవి కూడా చదవండి :

వన్ డౌన్ లో బ్యాటింగ్ చేయడంపై పాండ్య ఆసక్తికర వ్యాఖ్యలు…!

ఉమ్రాన్ విజయంకు వారే కారణం : తండ్రి అబ్దుల్ రషీద్

 

Visitors Are Also Reading