Home » పెళ్లిలో తలంబ్రాలు ఎందుకు పోసుకుంటారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

పెళ్లిలో తలంబ్రాలు ఎందుకు పోసుకుంటారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

by Sravanthi
Ad

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అపురూపమైన ఘట్టం. దీన్ని భారతీయ సంస్కృతిలో హిందువులు చాలా ఆర్భాటంగా జరుపుకుంటారు. అయితే హిందూ సంస్కృతి లో పెళ్లిళ్లు జరిగితే పెళ్లి సమయంలో అనేక ఘట్టాలు ఉంటాయి. ఇందులో ముఖ్యమైంది తలంబ్రాలు. ఈ ఘట్టం చాలా చూడముచ్చటగా ఉంటుంది. వధూవరులు ఇద్దరూ ఆనందంగా నవ్వుకుంటూ పోటాపోటీగా ఇందులో పాల్గొంటారు. తలంబ్రాలు అంటే అర్థం తలపై బియ్యం పోసేది.

Advertisement

ఇందులో సగం విరిగిన బియ్యాన్ని అసలు వాడకూడదు. ఈ తలంబ్రాలు పోసేటప్పుడు బ్రాహ్మణులు చదివే మంత్రం లో విశేషమైన అర్థాలు కూడా ఉంటాయని ఆ మంత్రాలు సంసారం బాధ్యతలను గుర్తు చేస్తాయని చెబుతున్నారు. ముందుగా ఆ తలంబ్రాలను కొబ్బరి కుడుకలు లో పోసి, నేతిలో ప్రోక్షించి వధూవరులిద్దరికీ అందించి ‘ కపిల గోవులను స్మరిస్తూ, పుణ్య దానం చేయాలని, వృద్ధి శాంతి, తుష్టి పుష్టి కలగాలని, అన్ని విఘ్నాలు తొలగి ఆయుష్షు పెరిగి, ఆరోగ్యం క్షేమం అన్నివిధాల మంగళం కలగాలని, సత్కర్మలు కూడా అభివృద్ధి చెందాలని పిల్ల పాపలతో సుఖసంతోషాలతో జీవించాలని పురోహితులు మంత్రాలు పాటిస్తూ ఉంటారు.

Advertisement

ఈ విధంగా మంత్రోచ్చారణ చేస్తూ ఉన్న సమయంలో వరుడు తలపై వధువు తలంబ్రాలు పోస్తుంది.
అలాగే వరుడు ఇష్టంతో చేసే త్యాగమైనా సమృద్ధిగా ఉండాలని అనుకుంటూ తలంబ్రాలు వధువుపై పోస్తారు. అలాగే సిరిసంపదలు సమృద్ధిగా రావాలని మంత్రాలు చదువుతూ ఉంటారు.

ALSO READ :

పెళ్లి వేదిక‌పై కొట్టుకున్న వ‌ధూవ‌రులు.. కార‌ణం తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే..!

షుగర్ ఉన్న వాళ్ళు ఇలా చేస్తే 3 రోజుల్లో షుగర్ తగ్గి పోవడం ఖాయం.

 

 

Visitors Are Also Reading