తొలి లతా మంగేష్కర్ అవార్డు ప్రదానోత్సవానికి హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం హాజరయ్యారు. ముంబైలో నిర్వహించిన ప్రదానోత్సవం కార్యక్రమంలో మోడీకి తొలి లతాదీనానాథ్ మంగేష్కర్ అవార్డు వరించింది. ఈ అవార్డును అందుకున్న తరువాత కొద్ది సేపు బావోద్వేగానికి లోనయ్యారు మోడీ. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. లతా దీదీ నాకు అక్క లాంటిదని.. ఆమె నుండి నేను ఎనలేని ప్రేమను పొందినట్టు గుర్తు చేసారు.
లతా దీదీ అక్క పేరు మీద వచ్చిన ఈ అవార్డు.. ఆమెలోని ఏకత్వానికి, నాపై ఉన్న ప్రేమకు ప్రతీక అని పేర్కొన్నారు ప్రధాని. ఈ అవార్డును ప్రధాని దేశ ప్రజలందరికీ అంకితం చేశారు. అదేవిధంగా లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే తన సోదరి లతా మంగేష్కర్ నివాళురల్పించడమే కాకుండా ఆయోగా ఆనేవాలా పాట ట్యూన్ హమ్ చేసింది. అదేవిధంగా లత మంగేష్కర్ స్మారకార్థం ఈ అవార్డును నెలకొల్పారు.
Advertisement
Advertisement
దేశ నిర్మాణానికి ఆదర్శప్రాయమైన కృషి చేసిన వ్యక్తికి ప్రతీ ఏడాది ఈ అవార్డు ఇవ్వబడుతుందని.. లతా మంగేష్కర్ కుటుంబం.. మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ స్మృతి ప్రతిష్టాన్ ఛారిటబుల్ ట్రస్ట్ పేర్కొన్నది. సినిమా రంగంలో చేసిన సేవలకు ప్రముఖ నటులు ఆశా పరేఖ్.. జాకీ ష్రాఫ్‌లు మాస్టర్ దీనానాథ్ పురస్కారం అందుకున్నారు. భారత సంగీతానికి రాహుల్ దేశ్‌పాండేకు మాస్టర్ దీనానాథ్ పురస్కారం లభించగా.. ఉత్తమ నాటక అవార్డు సంజయ్ చాయాకు వరించింది.
Also Read
కాటన్ దుస్తులను ఉతికేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా..?