బుల్లి తెరపై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఎవరు గ్రీన్ ఎంటర్టైన్మెంట్ షో జబర్దస్త్ గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తెలుగు ప్రజానికానికి తెగ కామెడిని పంచుతుంది. ఎన్నిషోలు ఉన్నా ఎప్పటి నుంచో ఇది నెంబర్ వన్‌లోనే కొనసాగుతుంది. బిగ్‌బాస్ వచ్చాక కాస్త జోరు తగ్గినా.. ఆ షో లేనప్పుడు మాత్రం జనాలు దీనికే అంకితం అవుతున్నారు. ఇక ఇందులో సుడిగాలి సుధీర్ స్కిట్స్ హైలెట్ అనే చెప్పాలి. సుధీర్ స్కిట్ పూర్తి కాగానే నవ్వు ఆపుకోలేక జడ్జీ పూర్ణ అద్భుతంగా ఉందంటూ కొనియాడింది.
ముఖ్యంగా బాగున్న స్కిట్లకు Muద్దులు ఇవ్వడం పూర్ణకు అలవాటు. ఢీ షోలో అదేవిధంగా అద్భుతంగా డ్యాన్స్ చేసిన వారి చెంపలు కొరికేస్తుంది పూర్ణ. ఈ తరుణంలోనే తాము బాగా స్కిట్ చేసామని తమ బుగ్గ కూడా కొరకాలని సుధీర్, ఇమ్మాన్యూయేల్ లు జడ్జీ పూర్ణను కోరుతారు. దానికి ఆమె తడబడుతూ కాస్త మొహమాటంగా ఓకే చెబుతుంది. తొలుత ఇమ్మాన్యూయేలు చేతిపై Muద్దు పెడుతుంది. ఆ తరువాత సుధీర్ తెగ ఉత్సాహంతో ఉరుముకుంటూ సుధీర్ పూర్ణకు Muద్దు పెట్టేందుకు ముందుకొస్తాడు. స్టేజీ పైనే ఉన్న యాంకర్ రష్మీ మీరు సుధీర్‌తో Muద్దు పెట్టించుకుంటే తాను ఫీల్ అవుతానని చెబుతుంది. ఇక రోజా కళ్లు మూసుకుంటానని.. ఈ ఘోరం చూడలేను అని పేర్కొంటుంది.
సుధీర్ రెడి కాగానే రష్మీ ముఖం వాలిపోతుంది. రష్మి పెట్టాలా అని పూర్ణ అడగడం.. ఆమె ముఖం ఎర్రగా కందిపోవడం ఈ సీన్‌కే హైలెట్‌గా మారింది. ఇక రష్మీ బాధ చూడలేక రోజు చివరకు వార్నింగ్ ఇస్తూ.. సుధీర్ వెళ్లిపో అనడంతో సుధీర్-పూర్ణ Muద్దుకు చెక్ పడింది. కాస్త అయితే సుధీర్ ఏకంగా జడ్జీ పూర్ణకు Muద్దు పెట్టేసేవాడేమో. సుధీర్ రాగానే యాంకర్ రష్మీ ముఖంలోని హావభావాలు చూస్తే.. ఆమె ఎంతగా ఫీలయిందో అర్థమైపోతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read :
Gruhalakshmi ఏప్రిల్ 23 (ఈరోజు) ఎపిసోడ్ : తులసి ఫ్యాక్టరీకి తాళం.. పండుగ చేసుకుంటున్న లాస్య..!
ఎన్టీఆర్ కి RRR లో నిజంగానే అన్యాయం జరిగిందిగా ! మరి ఇదేంటి జక్కన్నా ?