Home » కోహ్లీ ఫెవరెట్ క్రికెటర్ ఎవరి మీకు తెలుసా..?

కోహ్లీ ఫెవరెట్ క్రికెటర్ ఎవరి మీకు తెలుసా..?

by Azhar
Ad
భారత U-19 క్రికెట్ జట్టు అత్యధికంగా మొత్తం 5 సార్లు ప్రపంచ కప్ గెలిచిన విషయం తెల్సిందే. అయితే ఈ ప్రపంచ కప్ లు భారత్ కు తెచ్చిన సారథులలో విరాట్ కోహ్లీ కూడా ఒక్కడు. కోహ్లీ కెప్టెన్సీలో భారత యువ జట్టు 2008 లో జరిగిన U-19 ప్రపంచ కప్ లో సౌత్ ఆఫ్రికా జట్టును ఓడించి టైటిల్ ను అందుకుంది.
అయితే ఈ టోర్నీ జరుగుతున్న సమయంలో ఇప్పటి ఈ సీనియర్ ఆటగాళ్లు.. అప్పటి యువ ఆటగాళ్లు అయిన కోహ్లీ, జడేజా, మనీష్ పాండే లు తమ ఇంట్రో ఇస్తూ అప్పటి తమ ఫెవరెట్ క్రికెటర్ ఎవరో చెప్పారు. అందులో మొదటగా కెప్టెన్ కోహ్లీ తాను మిడిల్ ఆర్డర్ బ్యాటర్, అలాగే క్విక్ బౌలర్ అని చెప్పి తన ఫెవరెట్ క్రికెటర్ గా అప్పటి సౌత్ ఆఫ్రికా క్రికెటర్ అయిన హెర్షెల్ గిబ్స్ పేరును చెప్పాడు.
ఇక ఆ తర్వాత రవీంద్ర జడేజా తన ఇంట్రో ఇస్తూ.. తనకు ఇష్టమైన ఆటగాడిగా యువరాజ్ సింగ్ పేరును వెల్లడించాడు. ఇక మనీష్ పాండే ఇంగ్లాండ్ ఆటగాడు అయిన కెవిన్ పీటర్సన్ ను తన ఫెవరెట్ క్రికెటర్ అని ప్రకటించారు. అయితే అప్పుడు యువ ఆటగాళ్లుగా తమకు ఇష్టమైన ఆటగాళ్ల పేర్లు చెప్పిన ఈ ఆటగాళ్లు ఇప్పుడు ఎంతో మందికి ఫెవరెట్ క్రికెటర్ అనే విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి :

Advertisement

Visitors Are Also Reading