2022 సంవత్సరంలో మొదటి సూర్య గ్రహణం.. ఈ ఏప్రిల్ 30 తేదీన రాత్రి 12:15 నుండి ఉదయం 04:08 గంటల వరకు ఉంటుంది. అయితే ఈ గ్రహణం అనేది మేషరాశిలో వస్తుంది. అలాగే ఆ సమయంలో మేషరాశిలో సూర్యుడు, చంద్రుడు, రాహువుల కలయిక జరుగుతుంది. అందువల్ల ఈ 3 రాశుల వారికి గ్రహణ సమయం మంచిది కాదు. కాబట్టి ఈ మూడు రాశుల వ్యక్తులకు గ్రహణం సమయంలో ఎటువంటి సమస్యలు రావచ్చు అనేది ఇప్పుడు చూద్దాం…!
మేషరాశి : ఈ గ్రహణం రావడమే మేషరాశిలో వస్తుంది కాబట్టి.. దీని ప్రభావం వారిపైనే ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వారికీ శత్రువుల నుండి నష్టాలు, ప్రమాదాలు రావచ్చు. ఆలాగే ఈ సమయంలో వారికీ మానసిక ఒత్తిడి ఆర్థికంగా ఉంటుంది. ఇక ఈ గ్రహణ సమయంలో వీరు ఎట్టి ప్రయాణాలు చేయకూడదు.
కర్కాటక రాశి : ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. అందువల్ల వీరిపైనా కూడా దీని ప్రభావం ఉంటుంది. ఈ గ్రహణ సమయంలో మీకు తెలియని వారే మీపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తారు. అలాగే వీరికి ఖర్చులు ఆధికమవుతాయి. ముఖ్యంగా గ్రహణ సమయంలో మీరు ఓపికగా ఉండాలి.
వృశ్చిక రాశి : ఇక సూర్య గ్రహణం జరిగేటప్పుడు వృశ్చిక రాశి వారు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే మీ మతాల వల్ల మీరు గౌరవం కోల్పోయే ఆవకాశం ఎక్కువ. అలాగే వివాదాల వల్ల మీకు శత్రువుల నుండి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇక ఖర్చు చేసే విషయంలో కొంత ఆలోచించి ఖర్చు చేయండి.
ఇవి కూడా చదవండి :