తెలంగాణపై మరోసారి కన్నేశాడు చంద్రబాబు. కనీసం నామరూపాల్లేకుండా తుడిచిపెట్టుకుపోయిన పార్టీని ఎలాగైనా గాడిలో పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. దీనికోసం చంద్రబాబు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకప్పటి తన శిష్యుడు తెలంగాణ సీఎం కెసిఆర్ నేతృత్వంలో తెరాసకు ప్రత్యామ్నాయంగా టిడిపి వస్తుందా..? ఆ మేరకు బాబు ప్రయత్నాలు చేస్తారా..? చంద్రబాబు తెలంగాణలో కూడా సభ్యత నమోదు చేపట్టనున్నారని తెలుస్తోంది.
Advertisement
చాలా గ్యాప్ తర్వాత తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం అయినా చంద్రబాబు వారికి కీలక దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తో పోలిక చేసి కెసిఆర్ విధానాలు మెచ్చుకుంటూనే సైకిల్ తో టక్కరి ఇవ్వాలని వ్యూహాత్మక సందేశాన్ని ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీకి రాబోయే రోజుల్లో టిడిపి పార్టీ నిర్ణయం కావాలని, ఆ దిశగా పార్టీని బలోపేతం చేయాలని తెలంగాణ టిడిపి నాయకులకు చంద్రబాబు సూచించినట్టు తెలుస్తోంది.
Advertisement
హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. రికమండేషన్ లు సిఫార్సులతో నాయకుడిగా ఎదగాలేరని క్షేత్రస్థాయిలో పోరాటంతోనే నాయకత్వ లక్షణాలు వస్తాయి అని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో ఒకప్పుడు పట్టు ఉన్న టిడిపి బలహీనం కావడం వాస్తవమే కానీ మళ్లీ ఎలాగైనా పుంజుకునే విధంగా నాయకులు పనిచేయాలని వారిలో ఉత్సాహాన్ని నింపారు చంద్రబాబు.
ఇవి కూడా చదవండి :
ప్రశాంత్ కిషోర్‌ను కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరిన అధినాయకత్వం..!
ఐపీఎల్ or లవర్ : మీ సమాధానం ఏంటి..?
Chanakya Niti : పిల్లలు జీవితంలో విజయం సాధించాలంటే.. తల్లిదండ్రులు ఈ విషయాలను పాటించాలి