ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంతో రసవత్తరంగా మారాయి. ఎన్నికలకు చాలా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ఎవరి తోచిన విధంగా వారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒకవైపు అధికార పార్టీ మంత్రివర్గాన్ని మార్చిన విషయం తెలిసిందే. ఇక మరొక వైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుండే కసరత్తు ప్రారంభించిందినట్టు తెలుస్తోంది.
Advertisement
ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ ఇప్పటి నుంచే ఎన్నికలకు కసరత్తు మొదలు పెట్టారు. మరొక వైపు పవన్ మాట్లాడిన మాటలు అందుకు ఆజ్యం పోస్తున్నాయని.. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వమని.. కలిసి వచ్చే అన్న పార్టీతలతో పొత్తు గురించి ఆలోచిస్తామని అని ప్రకటించడంతో ఏపీ లో అన్ని పార్టీలు అప్రమత్తం అయ్యాయి.
Advertisement
ఈ తరుణంలో సీఎం జగన్ సైతం దూకుడు తగ్గించి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ అవకావాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్‌ను రంగంలోకి దింపి ప్రచారం చేయించాలని చూస్తున్నట్టు సమాచారం. ప్రస్తుత టీడీపీ పరిస్థితి చూస్తుంటే.. ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వనున్నారని పార్టీ శ్రేణులు బహిరంగంగానే అధినేతతో చెప్పడం విస్వసనీయ సమాచారం. ప్రతి ఓటు, ప్రతి వ్యక్తి ముఖ్యం అని చంద్రబాబు సైతం టీడీపీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు. ఎన్టీఆర్ ఇమేజ్‌ను పార్టీకి అనుకుంటే టీడీపీకి తిరుగుండదని భావిస్తున్నట్టు సమాచారం. ఏపీలో జనసేన కూడా భారీగానే పుంజుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి పవన్, ఎన్టీఆర్‌ను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చేవిధంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి :
- అక్కినేని నాగార్జున ఆ నిర్ణయం తీసుకున్నారా ? సమంత కి మరో షాక్ తప్పదా ?
- ఇంగ్లాండ్ క్రికెటర్ రూట్ ఆసక్తికర నిర్ణయం..!