Home » చ‌రిత్ర సృష్టించిన విడుద‌ల ర‌జిని.. 32 ఏళ్ల‌కే మ‌హిళా మంత్రి..!

చ‌రిత్ర సృష్టించిన విడుద‌ల ర‌జిని.. 32 ఏళ్ల‌కే మ‌హిళా మంత్రి..!

by Anji

అతి త‌క్కువ స‌మ‌యంలోనే ఎక్కువ అటెన్ష‌న్ సాధించిన కొద్ది మంది రాజ‌కీయ నాయ‌కుల‌లో విడద‌ల ర‌జిని మొద‌టి వ‌ర‌స‌లో ఉంటారు. అందివ‌చ్చిన ప్ర‌తీ అవ‌కాశాన్ని చ‌క్క‌గా ఉప‌యోగించుకుని.. చిన్న వ‌య‌సులోనే మంత్రి ప‌ద‌వీని అధిరోహించి చ‌రిత్ర సృష్టించారు. త‌క్కువ స‌మ‌యంలోనే సీఎం జ‌గ‌న్ అభిమానాన్ని చూర‌గొని 32 ఏళ్ల చిన్న వ‌య‌సులోనే కేబినేట్‌లో మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.


టీడీపీ ద్వారా రాజ‌కీయ ఆరంగేట్రం చేసిన విడ‌ద‌ల ర‌జిని.. అక్క‌డ కూడా త‌క్కువ స‌మ‌యంలోనే పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు దృష్టిని ఆక‌ర్షించారు. ఓ స‌మావేశంలో తాను, చంద్ర‌బాబు నాటిన మొక్క‌ను అని.. ఆయ‌న క‌ట్టిన హైటెక్ సిటీలో ఉద్యోగం చేసి, అక్క‌డి నుంచి అమెరికా వెళ్లి ఈస్థాయికి వ‌చ్చాను అని చెప్పారు. ముఖ్యంగా ఆ స‌మ‌యంలో సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి దారుణంగా విమ‌ర్శించ‌డం ద్వారా చ‌ర్చ‌నీయాంశంగా మారారు. ఇప్ప‌టికీ కూడా వైసీపీలో ఓ వ‌ర్గం విడ‌ద‌ల ర‌జినినీ సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేస్తూనే ఉన్నారు. 2019 ఎన్నిక‌ల‌కు ముందు ఆమె వైసీపీలో చేరి బ‌డానాయ‌కుల‌ను సైతం ప‌క్క‌కు నెట్టి ఎమ్మెల్యే ప‌ద‌వీ సాధించారు. తొలి ప్ర‌య‌త్నంలోనే టీడీపీలో కీల‌క నేత‌గా ఉన్న మాజీ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్ల‌రావును ఓడించి చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా గెలిచి మూడేళ్లు తిరిగే నాటికి మంత్రి ప‌ద‌వీ ఛాన్స్ కొట్టేశారు. సీఎం జ‌గ‌న్ విడద‌ల ర‌జినికి ఏపీ వైద్యారోగ్య‌శాఖ‌, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

హైద‌రాబాద్‌లో 1990 జూన్ 24న విడ‌ద‌ల ర‌జిని జ‌న్మించారు. ముదిరాజ్ సామాజిక వ‌ర్గానికి చెందిన ర‌జిని మ‌ల్కాజిగిరిలోని సెయింట్ ఆన్స్ మ‌హిళా డిగ్రీ క‌ళాశాల‌లో 2011లో బీఎస్సీ కంప్యూట‌ర్స్ పూర్తి చేసారు. అనంత‌రం ఎంబీఏ కూడా పూర్తి చేశారు. ఓ ఐటీ కంపెనీలో సాప్ట్‌వేర్ ఉద్యోగినిగా కొద్ది రోజులు ప‌ని చేసిన ర‌జినికి.. విడ‌ద‌ల కుమార‌స్వామితో పెళ్లి అయింది. ర‌జిని, కుమార‌స్వామి దంప‌తుల‌కు ఒక పాప‌, ఒక బాబు సంతానం. భ‌ర్త కుమార‌స్వామితో క‌లిసి సాప్ట్‌వేర్ కంపెనీలో ప‌ని చేసిన ర‌జిని మెరుగైన అవ‌కాశం కోసం అమెరికా బాట ప‌ట్టారు. భ‌ర్త‌తో అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉంటూ సాప్ట్‌వేర్ మ‌ల్టీ నేష‌న‌ల్ కంపెనీ ప్రాసెస్ వీవ‌ర్ కంపెనీ ఏర్పాటు చేశారు. కొద్ది రోజుల పాటు డైరెక్ట‌ర్‌, బోర్డు మెంబ‌ర్‌గా సేవ‌లందించారు. అమెరికాలో అతి త‌క్కువ కాలంలో ఆర్థికంగా బాగానే స్థిర‌ప‌డ్డారు.


ఆ త‌రువాత అమెరికా నుంచి ఏపీకి తిరుగు ప‌య‌నం అయ్యారు. రాజ‌కీయ ల‌క్ష్యాల‌తో ఏపీ రాష్ట్రానికి వ‌చ్చి 2014 టీడీపీ ద్వారా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. సొంత గ్రామానికి ఏదైనా సేవ చేయాల‌నే సంక‌ల్పంతో భ‌ర్త కుమార‌స్వామి ప్రోత్సాహంతో వీఆర్ ఫౌండేష‌న్ ప్రారంభించారు. సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. టీడీపీ ఎమ్మెల్యే సీటు ల‌భించ‌డం క‌ష్టం అని భావించిన విడ‌ద‌ల ర‌జిని 2018 సంవ‌త్స‌రం ఆగ‌స్టు 24వ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

2019 ఎన్నిక‌ల్లో చిల‌క‌లూరి పేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్య‌ర్థి, అప్ప‌టి మంత్రి ప‌త్తిపాటి పుల్లారావుపై 8,301 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. చిలక‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలో గెలిచిన తొలి బీఈ మ‌హిళ‌గా చ‌రిత్ర సృష్టించారు. శాస‌న‌స‌భ వేదిక‌గా.. సీఎం జ‌గ‌న్‌పై ఓ రేంజ్లో పొగ‌డ్త‌లు కురిపించే విడ‌ద‌ల ర‌జిని నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటారు. అదేవిధంగా సోష‌ల్ మీడియాలో ఆమె ప్ర‌త్యేక టీమ్‌ను ఏర్పాటు చేసుకుని ఎప్ప‌టిక‌ప్పుడు త‌న గ‌ళాన్ని వినిపిస్తుంటారు. ప్ర‌జ‌ల్లో యాక్టివ్‌గా ఉండ‌డం.. అన్నివ‌ర్గాల‌కు అందుబాటులో ఉండ‌డం ర‌జినికి క‌లిసొచ్చిన అంశాలుగా రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. ప్ర‌స్తుతం ఏపీ సీఎం జ‌గ‌న్ ఏపీ వైద్యారోగ్య‌శాఖ‌, కుటుంబ సంక్షేమ‌శాఖ కేటాయించ‌డంతో విడ‌ద‌ల ర‌జిని హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

 

 

 

Visitors Are Also Reading