Home » నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. పోలీస్ ఉద్యోగాల‌కు స‌న్న‌ద్దం అవుతున్న వారికి ఉచిత కోచింగ్

నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. పోలీస్ ఉద్యోగాల‌కు స‌న్న‌ద్దం అవుతున్న వారికి ఉచిత కోచింగ్

by Anji
Ad

పోలీస్ ఉద్యోగాల‌కు సిద్ధ‌మ‌య్యే ప్రిపేర్ అయ్యే అభ్య‌ర్థుల‌కు రాచ‌కొండ పోలీసులు శుభ‌వార్త చెప్పారు. వీరికి ఉచితంగా కోచింగ్ ఇవ్వ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇటీవ‌ల తెలంగాణ‌లో 80,039 ఉద్యోగ ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు అసెంబ్లీ వేదిక‌గా సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిన‌దే. ఈ ఖాళీల భ‌ర్తీకి సంబంధించి త్వ‌ర‌లో నోటిఫికేష‌న్లు విడుద‌ల‌య్యే అవ‌కాశ‌ముంది. ఈ 80,039 ఖాళీల‌లో అత్య‌ధికంగా పోలీస్ శాఖ‌లో 18,334 ఖాళీలున్న‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ ఖాళీల‌కు ల‌క్ష‌లాది మంది నిరుద్యోగులు పోటీ ప‌డుతూ ఉంటారు. చాలా మంది పేద వ‌ర్గాల‌కు చెందిన అభ్య‌ర్థులు కోచింగ్ తీసుకునే స్తోమ‌త లేక ఇబ్బంది ప‌డుతుంటారు.


అలాంటి వారికి రాచ‌కొండ పోలీసులు శుభ‌వార్త చెప్పారు. రాచ‌కొండ జోన్ ప‌రిధిలో నివాస‌ముండే అర్హులైన నిరుద్యోగుల‌కు పోలీస్ ఉద్యోగాల‌కు ఉచితంగా శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. రాచ‌కొండ కమిష‌న‌ర్ ఆఫ్ పోలీస్ ఆధ్వ‌ర్యంలో ఈ శిక్ష‌ణ ఉంటుంద‌ని వెల్ల‌డించారు. అనుభ‌వ‌జ్ఞులైన నిపుణుల‌తో ఔట్‌డోర్‌, ఇండోర్ ఫ్యాక‌ల్టీతో ఉచితంగా శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్టు తెలిపారు.

Advertisement

Advertisement

అప్లై చేయ‌డం ఎలా..?

అర్హ‌త‌, ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ఏప్రిల్ 05వ తేదీ సాయంత్రం 6 గంట‌ల్లో QR కోడ్‌ను స్కాన్ చేసుకుని పేర్ల‌ను న‌మోదు చేసుకోవ‌చ్చు అని పోలీస్ క‌మిష‌న‌ర్ కార్యాల‌యం వెల్ల‌డించింది. అభ్య‌ర్థులు త‌మ స‌మీప పోలీస్ స్టేష‌న్‌కు వ్య‌క్తిగ‌తంగా వెళ్లి కూడా త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకోవ‌చ్చు. అభ్య‌ర్థుల ఇంట‌ర్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా 18 ఏళ్ల‌కు పైగా వ‌య‌స్సు క‌లిగి ఉండాలి.

ఇలా స్కాన్ చేసి రిజిస్ట్రేష‌న్ చేసుకోండి

రాచ‌కొండ‌ పోలీస్ క‌మిష‌న‌ర్ మ‌హేష్ భ‌గ‌వ‌త్ ఆధ్వ‌ర్యంలో కోచింగ్ ఇవ్వ‌నున్నారు. రంగారెడ్డి, మేడ్చ‌ల్‌-మ‌ల్కాజిగిరి, యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాల క‌లెక్ట‌ర్లు స్వ‌చ్ఛంద సంస్థ‌లు దాత‌లు స‌హాయ స‌హ‌కారాల‌తో పోలీస్ ఉద్యోగాలు పొందాల‌నుకునే అభ్య‌ర్థుల‌కు ఉచిత కోచింగ్ ఏర్పాటు చేస్తున్నారు. గ‌తంలో రాచ‌కొండ పోలీసుల ద్వారా కోచింగ్ తీసుకుని 588 మంది పోలీస్ ఉద్యోగాల‌కు ఎంపిక‌య్యారు. ఎంపికైన వారు వివిధ పోలీస్ స్టేష‌న్‌ల‌లో విధులు నిర్వ‌హిస్తున్నారు.

Also Read : కేజీఎఫ్ వెనుక ఇంత క‌థ ఉందా..? తెలుస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే..!

Visitors Are Also Reading