Home » కేజీఎఫ్ వెనుక ఇంత క‌థ ఉందా..? తెలుస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే..!

కేజీఎఫ్ వెనుక ఇంత క‌థ ఉందా..? తెలుస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే..!

by AJAY
Ad

కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్‌. కేజీఎఫ్ అన‌గానే చాలా మందికి సినిమా పేరు గుర్తుకు వ‌స్తుంది. కానీ ఈ విష‌యం గురించి చాలా త‌క్కువ మందికి తెలుసు. ఈ ప్రాంతంలో 19వ శ‌తాబ్దంలో బంగారం కోసం తవ్వ‌కాలు జ‌రిగేవ‌ని ఇప్ప‌టి ప్ర‌జ‌లకు తెలియ‌దు. గ‌తంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్ భార‌త్ ఎంతో ముఖ్య‌మైన బంగారు గ‌నిగా పేరు ప్ర‌తిష్ట‌లు సంపాదించాయి. ఈ పేరు ప్ర‌తిష్ట‌లు ఎంతో కాలం నిలువ‌లేదు. ప్ర‌భుత్వం వాటిని మూసివేయించిన ప్ర‌స్తుతం ఈ గ‌నుల్లో తవ్వ‌కాలు జ‌ర‌గ‌డం లేద‌ట‌. కేజీఎఫ్ లో ఎంత బంగారం ఉండ‌వ‌చ్చు.. దాని చరిత్ర ఏమిటో ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాం.

Advertisement

భార‌తీయుల కంటే ముందే కేజీఎఫ్‌ను బ్రిటీషు వారు గుర్తించారు. అప్పటి మహారాజు టిప్పుసుల్తాన్ బ్రిటిష్ వారికి ఎదురు నిలిచి పోరాడారు. ఆ సమయంలోనే ఆంగ్లో మైసూర్ యుద్ధాలు జ‌రిగాయి.1767-69 మ‌ధ్య కాలంలో ఈ యుద్ధాలు చోటు చేసుకున్నాయి. వరుసగా మూడుసార్లు ఆంగ్లో-మైసూర్ యుద్ధాలు జ‌రిగాయి. 1680-84 లో ఇండో ఆంగ్లో-మైసూర్ యుద్ధం, 1790- 92 లో మూడవ మైసూర్ యుద్ధం జరిగింది. 1799లో జరిగిన నాలుగవ మైసూరు యుద్ధంలో టిప్పుసుల్తాన్ మరణించారు. కాలక్రమంలో అక్కడ సామంతరాజుల ని పెట్టి పరిపాలన కొనసాగించారు. 1802 లో బ్రిటిష్ వారు మైసూర్ పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. 1804 లో ఈస్ట్ ఇండియా కు చెందిన మైకేల్ అనే ఒక వ్యక్తి ఒక ఆర్టికల్ లో కేజీఎఫ్ గురించి అందులో ఉన్న బంగారు గనుల గురించి తెలుసుకున్నాడు.

సమయం చూసుకొని 1871 లో బెంగళూరుకి షిఫ్ట్ అయ్యాడు. ఆ తరువాత కొంత కాలానికి ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపాడు. అభివృద్ధి పేరిట బ్రిటిష్ ప్రభుత్వం పన్నాంగ పన్నింది. మైసూర్ మహారాజు కుబ్రిటిష్ ప్రభుత్వం ఒక ప్రతిపాదన కూడా పంపింది. కోలార్ ప్రాంతంలో కావేరి నదిపై జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలి అని తెలిపింది. వెంటనే ఈ ప్రతిపాదనకు మైసూర్ మహారాజు కూడా అంగీకారం తెలిపారు. ఈ కోలాట గనులలో యాభై ఆరు కేజీల మట్టిలో ఒక గ్రాము బంగారం లభించేది. ఈ ప్రాంతంలో బంగారం గురించి బ్రిటిష్ ప్రభుత్వం సర్వే చేసింది. 1857 సంవత్సరంలో లావెళ్లి అనే వ్యక్తి ఈ ప్రాంతానికి వచ్చారు. ఈ ప్రాంతం గురించి ఆసక్తికరమైన విషయాలను ఒక ఆర్టికల్ చదవడం ద్వారా తెలుసుకున్నారు. రెండేళ్లపాటు కోలార్ లో పర్యటించారు. అక్కడ అద్భుతమైన బంగారు గని ఉందని తెలుసుకొని ఆ బంగారాన్ని వెలికి తీయాలి అని భావించారు. ప్రయత్నాలను కూడా కొనసాగించారు. ఈ గనులు తవ్వడానికి 1878 సంవత్సరంలో లావెల్లికి 20 ఏళ్లపాటు లీజుకు ఇచ్చారు.

Advertisement

ఈ గనులను తవ్వాలి అంటే మాత్రం చాలా ఖర్చు అయ్యేది. బంగారం మాత్రం దక్కలేదు. దీనితో ఇక్కడ ఉన్న బంగారాన్ని వెలికి తీయడానికి తన దగ్గర అంత డబ్బు లేకపోవడంతో తనకు ఉన్న హక్కులను అమ్మేసుకున్నాడు. ఆ తర్వాత చాలామంది గనుల తవ్వకానికి ప్రయత్నించినా కూడా ఎవ్వరూ నిలవలేదు. మధ్యలోని వెళ్ళిపోతూ ఉండేవారు. 1880లో డీలర్ అండ్ సన్స్ కంపెనీ ప్రవేశించింది. కేజీఎఫ్ పనులను ముమ్మరం చేసిన‌ది. అప్పటి వరకు కేజీఎఫ్ నష్టాల లోనే ఉంది. ఈ కంపెనీ ఇంగ్లాండ్ నుంచి ఎన్నో యంత్రాలను తెప్పించి సాంకేతికంగా అభివృద్ధి చేసింది. బంగారు తవ్వకాలు మొదలవడంతో డీలర్ అండ్ సన్స్ కంపెనీ లాభాల బాట పట్టింది. ఇక్కడ పని చేయడానికి ఎంతో మంది ఇంజనీర్లు బ్రిటిష్ నుంచి వచ్చారు. 1900 నుండి 1910 మధ్యలో ఈ గనులకు గోల్డెన్ టైం వచ్చింది అని చెప్పవచ్చు. ఒక లక్షా 70 వేల టన్నుల బంగారం వెలికితీశారు, చాలా లోతు వరకు కూడా తవ్వకాలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ గని నీ ప్రపంచంలోనే లోతైన గని గా చెప్తారు. కిరోసిన్ దీపాల తోనే ఈ తవ్వకాలు జరుగుతూ ఉండేవి. ఇబ్బందులు ఎదురు కావడంతో ఇక్కడ కూడా పవర్ ప్లాంట్ సృష్టించాలని భావించారు. అప్పటికే ఇంగ్లాండులో పవర్ ని సృష్టించడం జరుగుతుంది. ఇక్కడ కూడా పవర్ ని సృష్టించాలి అని ఉద్దేశంతో కావేరీ నది పై పనులను మొదలు పెట్టారు. ఆ ప్రాంతంలో విద్యుత్ ని ఏర్పాటు చేశారు. కోలార్ ప్రాంతంలో 128 కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్ ని ఏర్పాటు చేశారు. ఆ రోజులలోనే కోలార్ విద్యుత్ లైన్ అత్యంత పొడవైన విద్యుత్ లైన్ గా పేరుప్రఖ్యాతులు పొందింది.


ఆ పవర్ ప్లాంట్ దేశంలోనే మొదటి పవర్ ప్లాంట్ గా నిలిచింది. విద్యుత్ పనులు ప్రారంభం కాగానే ఆ ప్రాంతంలో బంగారాన్ని దోచుకెళ్లి పనులు కూడా మొదలుపెట్టారు. ఆ ప్రాంతంలో ఎక్కువ మంది బ్రిటిష్ వారే ఉండేవారు. అక్కడే బంగ్లా కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ ప్రాంతమంతా కూడా మినీ ఇంగ్లాండ్ గా మారిపోయింది. వాడి కింద పనిచేసే భారతీయులు మాత్రం షెడ్లు ఏర్పాటు చేసుకొని బ్రతుకుతూ ఉండేవారు. అక్కడ కూలీల బ్రతుకులు మార్చాలని దుర్భరంగా ఉండేది. ఒక దశలో బంగారాన్ని దోచుకుంటున్నారు అని కేజీఎఫ్ కోర్టుకు కూడా వెళ్ళింది. దీంతో అదనపు రాయితీని ఇవ్వడానికి ఇంగ్లాండ్ ఒప్పుకుంది. అలా ఒప్పందంతో ఇంగ్లాండ్ భారత్ నుంచి నేరుగా బంగారాన్ని ఎగుమతి చేస్తుంది. స్వాతంత్రం వచ్చాక 1956లో ఈ గనులు జాతీయ గనులుగా పేరు పొంది కేంద్ర ప్రభుత్వం చేతులలోకి వచ్చాయి. అప్పుడు కూడా ఈ గనులలో తవ్వకాలు జరిగేవి. 2001 వరకు ఈ తవ్వకాలను కొనసాగించారు. భారత్ లో ఉత్పత్తి అయ్యే బంగారం లో 95 శాతం బంగారం ఏ ప్రాంతం నుంచి వచ్చేది. ప్రపంచబ్యాంకు నుంచి లోను తీసుకోవద్దు అని అప్పటి నెహ్రూ కే జి ఎఫ్ బంగారు గనులు తాకట్టు పెట్టారు. 1980లో ని కేజీఎఫ్ పతనం మొదలైనట్లుగా చెప్తారు. 2001 వచ్చే నాటికి మూడు కిలోమీటర్ల మేర స్వరంగాలు ఏర్పడ్డాయి. మట్టిలో బంగారు స్థాయి మాత్రం గణనీయంగా పడిపోయింది. 95 శాతం నుంచి సున్నా స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి తవ్వకాలు జరగడం లేదు. ఎప్పటికైనా వాటిని తిరిగి తెరిచి తవ్వాలని కొంతమంది భావిస్తున్నారు. కానీ ఆ ప్రాంతంలో ఉన్న బంగారు నెలల కంటే వాటిని బయటికి తీయడానికి అయ్యే ఖర్చు ఎక్కువ. అందుకే ఆ ప్రయత్నాన్ని దాదాపుగా విరమించుకున్నట్లు గా తెలుస్తుంది.

Visitors Are Also Reading