దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. ఈ సినిమా క్రియేట్ చేసే రికార్డులకు బాలీవుడ్ షేక్ అవుతుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 25న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వసూల్లు రాబడుతూ దూసుకుపోతుంది. ఇప్పటికే విడుదలై వారం రోజులు అవుతున్నా దాదాపు రూ.1000 కోట్లకు చేరువలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే 250 కోట్లకు పైగా వసూలు చేయడం విశేషం.
Also Read : ఆర్ఆర్ఆర్‌లో తారక్, చరణ్ హీరోలని శ్రియకు తెలియదట..!
Advertisement
ఇక హిందీలో 150 కోట్ల మార్క్‌ను చేరుకుంది. కేవలం హిందీ వర్షన్ అంటే గుజరాత్, యూపీ, బీహార్, ఒడిషా, రాజస్థాన్ ప్రాంతాల్లో ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ కలెక్షన్లు దూసుకెళ్తున్నాయి. ఈ సినిమాలో ఆలియా భట్, బ్రిటీష్ నటి ఓలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. వీరికంటే ముందే చాలా మంది హీరోయిన్ల పేరు తెరపైకి వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించేందుకు రిజెక్ట్ చేశారట. జక్కన్న సినిమాలో ఛాన్స్ వదులుకున్న ఆ హీరోయిన్స్ ఎవరా అని సెర్చ్ చేస్తున్నారు.
Advertisement
సీత పాత్ర కోసం ఆలియా కంటే ముందే శ్రద్ధాకపూర్‌ను అప్రోచ్ అయ్యారట. కానీ ఆమె బిజీ షెడ్యూల్స్ వల్ల ఈ ఆఫర్‌ని తిరస్కరించిందట. ఆ తరువాత పరిణితి చోప్రాను అడగగా ఆమె కూడా డేట్స్ అడ్జస్ట్ చేసుకోలేక సినిమాను వదులుకుంది. ఎన్టీఆర్ కు జోడీగా ఒలివియా కంటే ముందు అమీజాక్సన్‌ను సంప్రదించారట. కానీ ప్రెగ్నెన్సీ కారణంగా ఆమె కూడా నో చెప్పిందట. దీంతో బ్రిటన్ నటి డైసీ ఎడ్గార్ జోన్స్ అనే నటినీ తీసుకున్నా కొద్ది రోజులకే ఆమె ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఆ ఛాన్స్ ఒలివియా మోరిస్‌కు దక్కిందన్నమాట. అయితే ఆలియా పాత్ర సినిమాలో చెప్పుకోదగ్గ సమయం లేకపోవడంతో ఆమె హర్ట్ అయినట్టు తెలుస్తోంది.
Also Read : జూనియర్ ఎన్టీఆర్, వడ్డె నవీన్ బావ, బావమరుదులు అని మీకు తెలుసా..?