Home » ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డికి అధిష్టానం ఊహించ‌ని షాక్‌.. బాధ్య‌తల నుంచి త‌ప్పించిన పీసీసీ

ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డికి అధిష్టానం ఊహించ‌ని షాక్‌.. బాధ్య‌తల నుంచి త‌ప్పించిన పీసీసీ

by Anji
Published: Last Updated on
Ad

సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం షాక్ ఇచ్చింది. ఇప్ప‌టివ‌ర‌కు ఆయ‌న‌కు అప్ప‌గించిన టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్య‌త నుంచి త‌ప్పించిన‌ట్టు ప్ర‌క‌టించింది. పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల బాధ్య‌త‌లు, అనుబంధ సంఘాల బాధ్య‌త‌ల నుంచి కూడా జ‌గ్గారెడ్డిని త‌ప్పించిన‌ట్టు పీసీసీ పేర్కొంది. ఆయ‌న‌కు గ‌తంలో అప్ప‌గించిన బాధ్య‌త‌ల‌ను మిగ‌తా వ‌ర్కంగ్ ప్రెసిడెంట్ల‌కు అప్ప‌గిస్తూ టీపీసీసీ నిర్ణ‌యం తీసుకున్న‌ది.

Advertisement

Advertisement

జ‌గ్గారెడ్డి కొద్ది రోజులుగా రేవంత్‌రెడ్డి తీరును త‌ప్పుప‌డుతున్నారు. త‌న‌కు పార్టీలో త‌గిన ప్రాధాన్యం లేద‌ని మండిప‌డుతున్నారు. బాహాటంగానే విమర్శ‌లు చేస్తూ ఉన్నారు. కాం్గ‌రెస్ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌చార్జీ మాణిక్యం ఠాగూర్ పైనా తీవ్రంగా మండిప‌డుతున్నారు. హైద‌రాబాద్ హోట‌ల్ అశోక‌లో కాంగ్ర‌నెస్ విధేయుల గ్రూప్ పేరుతో స‌మావేశం నిర్వ‌హించారు. మ‌ర్రి శ‌శిధ‌ర్‌రెడ్డి, వి.హ‌న్మంత‌రావుతో కలిసి భేటీ అయ్యారు. పీసీసీ వారించినా విన‌కుండా భేటీ కొన‌సాగించారు. త‌న‌ను స‌స్పెన్ష‌న్ చేసినా భ‌య‌ప‌డేది లేద‌ని.. రోజుకొక‌రి వ్య‌వ‌హారాలు బ‌య‌ట‌పెడ‌తానంటూ జ‌గ్గారెడ్డి విమ‌ర్శ‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ప‌రిగ‌ణించిన పీసీసీ జ‌గ్గారెడ్డికి అప్ప‌గించిన బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించింది.

Also Read :  కికోతో కేటీఆర్ పోటో.. ప్ర‌శంస‌లు కురిపిస్తూ ట్వీట్

Visitors Are Also Reading