ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అన్ని ఫ్రాంచైజీలు ఇటీవల జరిగిన మెగా వేలంలో తమకు కావాల్సిన ఆటగాళ్లను దక్కించుకున్నాయి. టోర్నీలో విజేతగా నిలిచేందుకు అన్ని జట్లకు సంబంధించిన ఆటగాళ్లు కోచ్‌లు వ్యూహాలు రచిస్తున్నారు. ఇక ఈ సారి లీగ్లో కొన్ని జట్లు కొత్త జెర్సీ లతో బరిలోకి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో వంటి జట్లు తమ కొత్త జెర్సీని చూపించగా శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్ తమ కొత్త జెర్సీని ఆవిష్కరించింది.
Advertisement
Advertisement
జట్టు మేనేజింగ్ డైరెక్టర్ వెంకీ మైసూర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తమ కొత్త జెర్సీ గురించి అధికారికంగా ప్రకటించింది. కేకేఆర్ కొత్త జెర్సీ గోల్డ్, పర్పుల్ కలర్ల మేళవింపుతో రూపుదిద్దుకుంది. జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో వెంకీ మైసూర్ మాట్లాడుతూ శ్రేయస్ కెప్టెన్సీపై నమ్మకం ఉందన్నాడు. ఆటలో గెలుపోటములు సహజమని తమ ప్రయాణంలో ఎదురయ్యే ప్రతి సవాల్ ను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు.
Also Read : ఉక్రెయిన్‌కు భారత్ సాయం..!