Home » ఉక్రెయిన్‌కు భార‌త్ సాయం..!

ఉక్రెయిన్‌కు భార‌త్ సాయం..!

by Anji
Ad

ర‌ష్యా చేస్తున్న యుద్ధం వ‌ల్ల ఉక్రెయిన్‌లో ప‌రిస్థితులు నానాటికి దిగ‌జారుతుండ‌డం ప‌ట్ల భార‌త్ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఉక్రెయిన్‌లో నెల‌కొన్న మాన‌వ సంక్షోభం పై త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం అన్ని దేశాల‌కు ఉంద‌ని చెప్పింది. రానున్న రోజుల్లో ఉక్రెయిన్‌కు మ‌రింత సాయాన్ని అందిస్తామ‌ని తెలిపింది. ఐక్యరాజ్య‌స‌మితిలో భార‌త రాయ‌బారి టీఎస్ తిరుమూర్తి ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఉక్రెయిన్ సంక్షోభాన్ని నివారించేందుకు ప‌లు దేశాల విన్న‌పం మేర‌కు ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌తామండ‌లి అత్య‌వ‌స‌రంగా భేటీ అయింది.

Advertisement

తిరుమూర్తి మాట్లాడుతూ.. యుద్ధం ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ఉక్రెయిన్‌లో ప‌రిస్థితులు దిగ‌జారుతున్నాయ‌ని చెప్పారు. వేలాది మంది ప్రాణాలు కోల్పోగా.. ల‌క్ష‌లాది మంది ఇత‌ర దేశాల‌కు వ‌ల‌స వెళ్తున్నార‌ని పేర్కొన్నారు. ఆదేశంలోని మాన‌వ‌తా స‌ప‌రిస్థితుల‌పై భార‌త్ ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంద‌ని చెప్పారు. ఆ దేశ పౌరుల‌కు అంద‌రూ మాన‌వ‌త్వంతో సాయం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తెలిపారు. ఈ స‌మ‌స్య‌ను ర‌ష్యా, ఉక్రెయిన్ లు దౌత్య విధానాల ద్వారా మాత్ర‌మే ప‌రిష్క‌రించుకోవాల‌ని అంత‌కు మించి మార్గం లేద‌ని చెప్పారు. ఈ విష‌య‌మై ఇరు దేశాల‌తో భార‌త ప్ర‌ధానీ మోడీ మాట్లాడార‌ని తెలిపారు.

Advertisement

ఇప్ప‌టివ‌ర‌కు ఉక్రెయిన్ నుండి 22,500 మంది భార‌తీయుల‌ను వెన‌క్కి ర‌ప్పించామ‌ని తిరుమూర్తి చెప్పారు. మ‌రొక 18 దేశాల‌కు చెందిన ప్ర‌జ‌ల త‌ర‌లింపులో కూడా సాయం అందించామ‌ని తెలిపారు. దారుణ ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ పౌరుల కోసం ఇప్ప‌టికే 90 ట‌న్నుల‌కు పైగా ఔష‌దాలు ఇత‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ పౌరుల కోసం ఇప్ప‌టికే 90 ట‌న్నుల‌కు పైగా ఔష‌దాలు ఇత‌ర స‌హాయ సామాగ్రిని పంపించామ‌ని చెప్పారు.

Also Read : రిజిస్ట‌ర్ మ్యారేజ్.. కోర్టు వ‌ద్ద పూజాహెగ్దే హంగామా మామూలుగా లేదుగా..!

Visitors Are Also Reading