Home » Shane Warne : షేన్ వార్న్ అంత్య‌క్రియ‌ల‌కు తేదీ ఖ‌రారు..!

Shane Warne : షేన్ వార్న్ అంత్య‌క్రియ‌ల‌కు తేదీ ఖ‌రారు..!

by Anji
Ad

థాయ్‌లాండ్‌లోని త‌న విల్లాలో మార్చి 04న అక‌స్మాత్తుగా గుండెపోటుతో మ‌ర‌ణించిన స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ అంత్య‌క్రియ‌లు ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. మార్చి 30న సాయంత్రం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో సుమారు ల‌క్ష మంది అభిమానుల మ‌ధ్య వార్న్ తుది వీడ్కోలు కార్య‌క్ర‌మం నిర్వ‌హించేందుకు విక్టోరియా ప్ర‌భుత్వం స‌న్నాహ‌కాలు చేస్తోంది.


వార్న్‌కు ఎంసీజీతో ఉన్న ప్ర‌త్యేక అనుబంధం దృష్ట్యా అంతిమ సంస్కారాలు ఇక్క‌డే నిర్వ‌హించాల‌నుకున్నామని విక్టోరియా రాష్ట్ర స‌ర్వోన్న‌తాధికారి డేనియ‌ల్ ఆండ్రూస్ వెల్ల‌డించారు. ముఖ్యంగా వార్న్ విగ్ర‌హం కూడా ఎంసీజీ బ‌య‌టే ఉండ‌టంతో అభిమానులంద‌రూ అక్క‌డే నివాళుల‌ర్పిస్తున్నారు. వార్న్ పార్థివ దేహం థాయ్‌లాండ్ నుంచి ఆస్ట్రేలియాకు రావడానికి ఇంకా స‌మ‌యం ప‌డుతుంది.

Advertisement

Advertisement

1969 సెప్టెంబ‌ర్ 13న విక్టోరియా గ్రామంలో వార్న్ జ‌న్మించారు. అండ‌ర్ -19 విభాగంలో రాణించి జాతీయ జ‌ట్టుకు ఎంపిక‌య్యాడు. 1992లో సిడ్నీ వేదిక‌గా టీమిండియాతో జ‌రిగిన టెస్ట్ ద్వారా అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేసాడు. త‌న స్పిన్ మాయాజాలంతో ప‌దేహేనేళ్ల పాటు క్రికెట్ ప్ర‌పంచాన్ని శాసించాడు. ఈ త‌రుణంలో 145 టెస్ట్‌ల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు ప‌డ‌గొట్టాడు. స‌మ‌కాలీన క్రికెట్‌లో లంక దిగ్గ‌జ స్పిన్న‌ర్ ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ (1347) త‌రువాత వెయ్యి వికెట్లు తీసిన రెండ‌వ ఆట‌గాడిగా రికార్డు సృష్టించాడు.

Also Read :  ప‌దేళ్ల బాలుడికి అరుదైన వ్యాధి.. ఎంత తిన్నా తీర‌ని ఆక‌లి..!

Visitors Are Also Reading