Home » ప‌దేళ్ల బాలుడికి అరుదైన వ్యాధి.. ఎంత తిన్నా తీర‌ని ఆక‌లి..!

ప‌దేళ్ల బాలుడికి అరుదైన వ్యాధి.. ఎంత తిన్నా తీర‌ని ఆక‌లి..!

by Anji
Ad

క‌డుపు నిండా పౌష్టికాహారం తిన్నా.. ఆక‌లి మాత్రం తీర‌కుండా.. ఇంకా ఏదో తినాల‌ని అనిపిస్తే ఎలా ఉంటుంది..? అలాంటి ఆలోచ‌న అర‌గంట‌, గంట‌కాదు.. రోజంతా ఉంటే..? సింగపూర్ కు చెందిన 10 ఏళ్ల డేవిడ్ సూ ప‌రిస్థితి ఇదే. ఓ అరుదైన వ్యాధితో బాధ‌ప‌డుతున్నాడు ఆ బాలుడు. ఎంత తిన్నా క‌డుపు నిండ‌క‌పోవ‌డం, ఆక‌లి తీర‌క‌పోవ‌డం ఈ వ్యాధి ప్ర‌ధాన ల‌క్షణం. ఇంకా తినాలి అంటుంది మెద‌డు. ఈ వ్యాధిని ప్రేడ‌ర్ విల్లీ సిండ్రోమ్ అంటారు. ఇది ఒక జ‌న్యుప‌ర‌మైన స‌మ‌స్య‌, క్రోమోజోమ్ 15లోని కొన్ని జీన్స్ స‌రిగ్గా ప‌ని చేయ‌క‌పోవ‌డ‌మ‌మే ప్రేడ‌ర్ విల్లీ సిండ్రోమ్ కు కార‌ణం.

Advertisement

 

చికిత్స లేని ఈ వ్యాధి భ‌విష్య‌త్‌లో ఎలాంటి ప‌రిస్థితుల‌కు దారి తీస్తుందోన‌ని డేవిడ్ త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చెందుతున్నారు. కుమారుడి ఆరోగ్యాన్ని కాపాడేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా అత‌డి బ‌రువును అదుపులో ఉంచ‌డంపైనే ప్ర‌త్యేక దృష్టి పెట్టారు. డేవిడ్ ఇష్టారీతిన తిన‌కుండా చూసేందుకు వంట గ‌దికి తాళం వేస్తున్నారు. ఎప్పుడు ఏమి తినాలో స్ప‌ష్ట‌మైన షెడ్యూల్ రూపొందించి, త‌మ కుమారుడు దానికి క‌ట్టుబ‌డి ఉండేవిధంగా చూస్తున్నారు.

Advertisement

ఈ వ్యాధి బారిన ప‌డిన వారు ముందు బ‌రువు పెరుగుతారు. త‌రువాత అనేక స‌మ‌స్య‌లు వ‌స్తాయి. నియంత్ర‌ణ లేకుండా అసాధార‌ణ ప‌రిమాణంలో ఆహారం తీసుకుంటే జీర్ణ‌వ్య‌వస్థ అస్త‌వ్య‌స్థం అవుతుంది. ఇలా ఇప్ప‌టికే కొంద‌రూ ప్రేడ‌ర్ విల్లీ బాధితుల పేగుల‌కు చిల్లులు ప‌డిన దాఖ‌లాలున్నాయి. గ్యాస్ట్రిక్ టిష్యూ నెక్రోసిస్ క‌డుపు ఉబ్బ‌రం, గ్యాస్ట్రోప‌రేసిస్ వంటి ఇబ్బందులువ‌స్తాయి.

ఈ అసాధార‌ణ ఆక‌లి వల్ల మాన‌సిక స‌మ‌స్య‌లా త‌లెత్తుతాయి. తింటూనే ఉండాలన్న కోరిక‌ను నియంత్రించుకోవ‌డం పెద్ద స‌వాలే. స‌రైన ప‌ర్య‌వేక్ష‌ణ లేక‌పోతే ప్రేడ‌ర్ విల్లీ సిండ్రోమ్ బాధితులు శ‌రీరానికి హాని చేసే ప్ర‌మాద‌క‌ర‌మైన పాడైపోయిన ఆహారాన్ని దాచి పెట్టుకోవ‌డం, దొంగిలించడం, లేదా తిండి కోసం డ‌బ్బులు దొంత‌గ‌త‌నం చేయ‌డం వంటి ప‌నులు చేసే అవ‌కాశ‌ముంద‌ని ఓ నివేదిక వెల్ల‌డించింది.

Also Read :  Test Rankings 2022 : టెస్ట్ ర్యాంకింగ్స్‌లో జ‌డేజా నెంబర్ వ‌న్

Visitors Are Also Reading