Home » Shane Warne : క్రికెట్ దిగ్గ‌జం షేర్ వార్న్ టాప్ రికార్డుల గురించి మీకు తెలుసా..?

Shane Warne : క్రికెట్ దిగ్గ‌జం షేర్ వార్న్ టాప్ రికార్డుల గురించి మీకు తెలుసా..?

by Anji
Ad

ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గ‌జం షేన్ వార్న్ హ‌ఠాన్మ‌ర‌ణం క్రికెట్ అభిమానుల‌ను ఎంతో క‌లిచి వేస్తుంది. థాయ్‌లాండ్‌లోని ఓ విల్లాలో అచేత‌న స్థితిలో ప‌డి ఉన్న వార్న్‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేక‌పోయింది. దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా ఆట‌ప‌రంగానూ, వివాదాల ప‌రంగానూ ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్న షేన్ వార్న్ మ‌ర‌ణాన్ని క్రికెట్ లోకం జీర్ణించుకోలేక‌పోతుంది. గింగిరాలు తిరుగుతూ లెగ్ సైడ్ అవ‌త‌లంగా ప‌డిన వార్న్ బంతి ఒక్క‌సారిగా దిశ‌ను మార్చుకుని వికెట్ల‌ను గిరాటేసిన ఘ‌ట‌న‌ల‌ను క్రికెట్ ప్ర‌పంచం ఎన్న‌టికీ మ‌రువ‌లేదు. ఈ క్రికెట్ చ‌రిత్ర‌లో చివ‌రిస్థాయిగా నిలిచిపోయిన షేన్ వార్న్ కెరీర్ లోని ప‌లు అత్యుత్త‌మ రికార్డుల‌ను ఓ సారి గుర్తుకు చేసుకుందాం.

Advertisement

1969 సెప్టెంబ‌ర్ 13న విక్టోరియాలో షేన్‌వార్న్ జ‌న్మించారు. 23 ఏళ్ల వ‌య‌సులో 1992లో తొలిసారి జాతీయ జ‌ట్టుకు ప్రాతినిథ్యం వ‌హించాడు. వార్న్ త‌న ఆరంగేట్ర మ్యాచ్‌ను టీమిండియాపైనే ఆడాడు. తొలి మ్యాచ్‌లో ఒకే వికెట్ తీశాడు. అది కూడా టీమిండియా మాజీ హెచ్ కోచ్ ర‌విశాస్త్రిది కావ‌డం గ‌మ‌నార్హం. వార్న్ తొలిసారి శ్రీ‌లంక‌తో కొలంబోలో జ‌రిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా వెలుగులోకి వ‌చ్చాడు. ఆ మ్యాచ్ లో శ్రీ‌లంక గెల‌వాలంటే మ‌రొక 30 ప‌రుగులు చేయాలి. చేతిలో 3 వికెట్లు ఉన్నాయి. ఆ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో వార్న్ ఒక వికెట్ కూడా తీయ‌లేదు. కానీ కీల‌క‌మైన స‌మ‌యంలో చెల‌రేగి వెంట‌వెంట‌నే లంక చివ‌రి 3 వికెట్లు తీసి సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చాడు. దీంతో విజ‌యం ఖాయ‌మ‌నుకున్న శ్రీ‌లంక 16 ప‌రుగుల‌తో ఓడింది. ఇక అప్ప‌టి నుంచి క్రికెట్‌లో వార్న్ తిరిగి చూసుకోలేదు.

Advertisement

క్రికెట్ కెరీర్ లో షేన్ వార్న్ అత్యుత్త‌మ రికార్డు ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్ లోనే న‌మోదైంది. 1994లో బ్రిస్సెన్ వేదిక‌గా జ‌రిగిన యాషెస్ తొలి టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో షేన్ వార్న్ 71 ప‌రుగులు ఇచ్చి 8 వికెట్ల‌తో చెల‌రేగాడు. ఆ మ్యాచ్ మొత్తంలో 11 వికెట్లు తీసిన వార్న్ 184 ప‌రుగుల తేడాతో ఆస్ట్రేలియాను గెలిపించి ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. 1995లో ఇదే బ్రిస్బెన్ వేదిక‌గా పాకిస్తాన్‌తో జ‌రిగిన టెస్ట్ మ్యాచ్‌లో షేన్‌వార్న్ రెచ్చిపోయాడు. ఒక ఇన్నింగ్స్‌లో 23 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 7 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఆ మ్యాచ్‌లో మొత్తంగా 11 వికెట్లు తీశాడు.

ఇక వ‌న్డేల్లో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌ను షేన్‌వార్న్ 1996లో సిడ్నీ వేదిక‌గా వెస్టిండిస్‌తో జ‌రిగిన వ‌న్డే మ్యాచ్‌లో సాధించాడు. ఆ మ్యాచ్‌లో 33 ప‌రుగులే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. దీంతో విండిస్ 161 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. ఆ ల‌క్ష్యాన్ని ఆస్ట్రేలియా సునాయ‌సంగా చేధించింది. 1993లో 203 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన న్యూజిలాండ్ విజ‌యం ముంగిట వార్న్ అనూహ్యంగా బోల్తా కొట్టించాడు. చివ‌రిలో నాలుగు వికెట్లు తీసి కివిస్‌ను 199 ప‌రుగుల‌కే ఆలౌట్ చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. ఇలాంటి ఇన్నింగ్స్‌లు షేన్‌వార్న్ కెరీర్‌లో లెక్కలేన‌న్నీ ఉన్నాయి. త‌న బౌలింగ్ లో స్పిన్‌కు మారుపేరుగా నిలిచాడు. 2007లో 38 ఏళ్ల వ‌య‌స్సులో ఆట‌కు వీడ్కోలు ప‌లికాడు.

కెరీర్‌లో 145 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన షేన్‌వార్న్ 708 వికెట్లు తీశాడు. ఇక 194 మ్యాచ్‌ల‌లో 293 వికెట్లు తీశాడు. 55 టీ20 మ్యాచ్‌ల్లో 57 వికెట్లు తీశాడు. అన్ని ఫార్మాట్ల‌లో క‌లిపి వెయ్యి వికెట్ల‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఐపీఎల్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించిన వార్న్ తొలి సీజ‌న్‌లోనే ఆ జ‌ట్టును ఛాంపియ‌న్‌గా నిల‌బెట్టాడు.

Also Read :  PSPK 10 రిమేక్ సినిమాలు. 9 హిట్లు,1 ఫ‌ట్! ఇదిగో ఆ లిస్ట్!!

Visitors Are Also Reading