చరిత్రకే అపారమైన నిక్షేపాలకు కూడా ఆ ప్రాంతం నిలయం అని బయ్యారం చెరువు శాసనం చెబుతుంది. క్రీ.శ. 1219 నాటి కాకతీయుల వైభవం గురించి ఇక్కడి శాసనాలు పేర్కొంటున్నాయి. ఆ బయ్యారం ఇప్పుడు భగ్గుమంటున్నది. ఎన్నో నిక్షేపాలను తన గుండెల్లో పదిలంగా దాచుకున్న ఆ ప్రాంతంపై కేంద్రం చూపుతూ ఉన్న వివక్షను నిరసిస్తోంది. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ కోసం మరొకసారి ఉక్కు పిడికిళ్లు ఎగిశాయి.
Advertisement
ముఖ్యంగా ముడి ఖనిజాన్ని తన గర్భంలో భద్రంగా దాచుకుంది ఆ ప్రాంతం. అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. దశాబ్దాల నాటి డిమాండ్‌కు కేంద్రం ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నాలు చేస్తోందన్న అనుమానాలు కలుగుతున్నాయి. కేంద్రం ఆధ్వర్యంలోని సంస్థలే బయ్యారంలో అపారమైన ఖనిజ సంపద ఉన్నదని చెబుతుంటే.. కేంద్రం మాత్రం అబ్బెబ్బె అదేం లేదని బుకాయించే యత్నం చేస్తున్నది. బయ్యారంలో ముడి సరుకు ఉంది. కళ్లెదుట కనబడుతూనే ఉన్నది.
Also Read : BIGG BOSS OTT : హీరోయిన్ బిందు మాధవి గురించి ఎవరికీ తెలియని నిజాలు…!
Advertisement
కావాల్సిందల్లా పరిశ్రమ ఒక్కటే.. అనుమతులు ఇస్తూ.. నిధులు విడుదల చేయాలని, ఆ దిశగా కేంద్రం అడుగులు వేయాలి. కానీ కేంద్రం తీరు భిన్నంగా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి అడ్డుకట్ట వేస్తోంది. దాంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అన్న నినాదంతో పోరుకు సై అంటుంది. 1953 నుంచి జరిగిన ప్రతీ సర్వేలో బయ్యారంలో నాణ్యమైన ఐరన్ ఓర్ ఉన్నదనే చెబుతూ వచ్చాయి.
కేంద్రం మాత్రం అలాంటి ఉక్కు అక్కడ లేదన్న మాట వెనుక కుట్ర కోణం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రయివేటు పరం చేసే ప్రయత్నంలో భాగంగానే పరిశ్రమకు కేంద్రం సుముఖంగా ప్రభుత్వం ఉక్కు ఫ్యాక్టరీ సాధించే వరకు విశ్రమించమని చెబుతుంది. ఉక్కు సంకల్పంతో ముందుకు సాగుతోంది. వాస్తవానికి బయ్యారంపై పోరు ఈనాటిది కాదు. దశాబ్దాల నాటి కల. మరి అలాంటి ఉక్కు సంకల్పానికి అండగా నిలుస్తున్నది ఎవరు. ఆశలను కూల్చుతున్నదెవ్వరన్నది భవిష్యత్‌లో తేలుతుంది.
Also Read : వామ్మో కల్తీ.. ఆఖరికి అల్లాన్ని కూడా వదలలేదు.. ఇలా కూడానా..?