రష్యా ఉక్రెయిన్ ల మధ్య యుద్దం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. రెండు దేశాల మధ్య యుద్దవాతావరణం కొనసాగుతూ ఉండటం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఉక్రెయిన్ చిన్న దేశం కాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పుడు భారత్ కు రష్యా ఉక్రెయిన్ ల మధ్య ముదురుతున్న వివాదం అగ్నిపరీక్షలా మారింది. రష్యా భారత్ కు మిత్ర దేశం కాగా ఉక్రెయిన్ పరిస్థితి చూస్తే ఏదేశానికైనా జాలి వేయకతప్పదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తటస్థ వైఖరిని అవలంభిస్తోంది.
Advertisement
Advertisement
కాగా రెండు దేశాల మధ్య పరిణామాలపై నేడు ప్రధాని నరేంద్ర మోడీ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరియు భారత విదేశాంగమంత్రి ఎస్ జె శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, మరి కొన్ని విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రష్యా ఉక్రెయిన్ యుద్ద పరిణామాలు భారత్ పై ప్రభావం లాంటి అంశాలపై చర్చించారు.