ఉక్రెయిన్‌పై రష్యా ఏక్షణంలోనైనా యుద్ధం జరిగేందుకు రష్యా ప్రయత్నాలు ప్రారంభిస్తున్నట్టు కనిపిస్తోంది. తూర్పుఉక్రెయిన్లోని రెండు వేర్పాటు వాద ప్రాంతాలను ప్రత్యేక దేశాలుగా గుర్తిస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర్వులు జారీ చేసారు. దీంతో ఉక్రెయిన్ను మూడు ప్రాంతాలుగా మూడు ముక్కలు చేసినట్టు అయింది. ఇదివరకే ఉన్న ఉక్రెయిన్‌కు తోడు డోనెట్క్స్, లూహాన్స్లను స్వతంత్ర రాజ్యాలుగా గుర్తిస్తూ పుతిన్ సంతకాలు చేశారు.
Advertisement
మరొక వైపు అమెరికాతో చర్చలంటూనే ఉక్రెయిన్‌లోని తిరుగుబాటు దారులతో దాడులను చేయిస్తుంది. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ దగ్గర అణుబాంబు ఉందని ఆరోపించారు. కొన్ని దేశాల ఆర్మీ సహకారంతో రష్యాపై దాడికి ఉక్రెయిన్ ప్రయత్నిస్తోందన్నారు. చొరబాటుకు ప్రయత్నించిన ఐదుగురు ఉక్రెయిన్ సైనికులను రష్యా దళాలు కాల్చి చంపినట్టు తెలిపింది. ఇక రష్యా బలహీనపడాలని అమెరికా కోరుకుంటుందని మండిపడ్డారు. తమపై దాడి చేస్తే తిప్పి కొడతామని హెచ్చరించారు.
Also Read : తుస్సుమన్న భీమ్లానాయక్ ట్రైలర్…ఆ ఒక్క ట్వీట్ తో మళ్లీ అంచనాలు పెంచిన థమన్..!
Advertisement
డోనెట్క్స్, లూహాన్స్ రాష్ట్రాల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. బాణసంచా కాల్చి అక్కడి తీరుపై ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సార్వ భౌమత్వం విషయంలో రష్యా ఎలా జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితిలో ఎలా వ్యవహరించాలనే అంశంపై ఉక్రెయిన్, అమెరికా, బ్రిటన్ నిరంతర సమాలోచనలు జరుపుతున్నాయి. రష్యాను చర్చలకు ఒప్పించేందుకు ప్రయత్నాలు సాగుతుండగా.. ఇలాంటి చర్యలు చేపట్టడం అమెరికాకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఉక్రెయిన్‌పై దాడి ఆలోచన విరమించుకోకుంటే ఎదురుదెబ్బ తప్పదు అని అమెరికా రష్యాకు స్పష్టం చేసింది.
రష్యాపై నాటో కూటమి దేశాలు పలు ఆంక్షలను విధించాయి. వాటిలో ఐరోపా సమాఖ్య, బ్రిటన్, అమెరికా వంటి దేశాలున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ నుంచి వేర్పాటు వాద ప్రాంతాలైన డోనెట్క్స్, లూహాన్స్లలో అమెరికా ఎటువంటి వ్యాపారం చేయకుండా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా రష్యాపై ఆంక్షలు విధించినట్టు బ్రిటన్ విదేశాంగ మంత్రి లీజ్ ట్రస్ ట్విట్టర్లో ప్రకటించారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి సార్వభౌమత్వానికి భంగం కలిగించిందని ఆరోపించారు. ఇవాళ ప్రధాని బోరిస్ జాన్సన్ నేతృత్వంలో సమావేశం అయిన తరువాత నిర్ణయం తీసుకోనున్నారు.
Also Read : వేగంగా వెళ్తున్న బస్సుపై కూలిన భారీ వృక్షం.. ఎక్కడో తెలుసా..?